Categories
ANDHRA PRADESH FEATURED LOCAL

ఏపీలో e-పాస్ పొందండిలా!

అత్య‌వ‌స‌ర ప్ర‌యాణాలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌వాసులు
ఈ పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా…
Andhra Pradesh Police

రాష్ట్ర ప్రజల క్రియాశీల సహకారంతో ప్రభుత్వం వైరస్ నియంత్రణకు నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేయబడ్డాయి. అయినప్పటికీ, కిరాణా, ఇతర నిత్యావసర వస్తువులు పౌరులకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ పరిస్థితిలో కొంతమంది ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ తో ప్రయాణించేవారు, కుటుంబంలో మరణం, సామాజిక పనుల కోసం, ప్రభుత్వ విధి నిర్వహణలో లేదా ఇతర అత్యవసరమైన వాటి కోసం ప్రయాణించడానికి ఇక్కట్లు పడుతునట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రయాణానికి అవసరమైన వారికి పాస్ ఇవ్వమని పోలీసు శాఖను ఆదేశించారు. ముఖ్యమైన పని నిమిత్తం మాత్రమే ప్రజలు, పౌరులు E-PASS (ఈ-పాస్‌)ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
అత్యవసర పాస్‌ల కోసం అభ్యర్థించే వారు ఈ క్రింది సమాచారాన్ని అందించాలి:
1. ఫోటోతో పాటు పూర్తి పేరు, మొబైల్ నంబర్
2. మెడికల్ సర్టిఫికెట్లు, అధికారిక లేఖలు మొదలైనవి అప్‌లోడ్.
3. ఆధార్‌ను అప్‌లోడ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు
4. పూర్తి ప్రయాణ వివరాలు.
5. ప్రయాణించే వాహన పూర్తి వివరాలు, ప్రయాణీకుల సంఖ్య. కారుకు (1+3) అనుమతి.
Https: citizen.appolice.gov.in వెబ్‌సైట్‌లో పైన పేర్కొన్న అన్ని వివరాలతో పౌరులు/ ప్రజలు కోవిడ్ 19 అత్యవసర వాహన e-pass కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదించబడితే వాహన అత్యవసర e-pass ను దరఖాస్తు చేసుకున్నా వారి మొబైల్ నెం లేదా మీరు దరఖాస్తు చేసిన మెయిల్ ఐడికి పంపబడతాయి. వెబ్‌సైట్ నుండి జారీ చేసిన అత్యవసర పాస్‌లు మాత్రమే అంగీకరించబడతాయి. అత్యవసర వాహన పాస్‌తో పాటు, పౌరులు ప్రయాణించేటప్పుడు వారి ఒరిజినల్ ఐడి కార్డును కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. సమర్పించిన వివరాల ధృవీకరణ తరువాత, వీలైనంత త్వరగా ఈ-పాస్ జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై తగిన చర్యలు తీసుకుంటారు.

Categories
ANDHRA PRADESH FEATURED LOCAL

మీరు ఈ ఏరియాలో ఉన్నారా? అయితే జాగ్రత్త.

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వివరిస్తూ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం, గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్, బుచ్చయ్య నగర్, జిల్లా పరిధిలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన, కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

కరోనా అంతం ఎప్పుడు? క్లిక్ చేయండి.

వీటితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లా వడమాలపేట, శ్రీకాళహస్తి, ఈ ప్రాంతాలతో పాటు మద్దూరు పరిధిలోని పాణ్యం గ్రామం, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం, నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట, చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం, అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు వచ్చాయని, ఇక్కడి వారంతా తగు జాగ్రత్తల్లో ఉండాలని సూచించింది.

Categories
ANDHRA PRADESH FEATURED LOCAL

కేజీహెచ్ లో కలకలం. నర్సింగ్ సిబ్బందికి కరోనా సోకినట్లు అనుమానం!

విశాఖ, విజేత టీవీ: కేజీహెచ్ లో కరోనా కలకలం రేగింది. ఐదుగురు నర్సింగ్ స్టాఫ్ కి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు సమాచారం.

ఇటీవల స్టేట్ కోవిడ్ – 19 హాస్పిటల్ విమ్స్ లో క్వారెంటైన్ లో ఉన్న కరోనా పాజిటివ్ రోగులకు చికిత్సలో నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.

పాజిటివ్ రోగులకి చికిత్స చేసిన సిబ్బందికి 4 రోజుల విధులు ముగిసిన తర్వాత 14 రోజులు హోమ్ క్వారెంటైన్ లో ఉండేలా నిబంధనలు ఉన్నాయి. కాని పాజిటివ్ రోగులకు చికిత్స చేసిన స్టాఫ్ కు కేజీహెచ్ లో నిరంతరంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇప్పుడు ఐదుగురుకి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటం తో నర్సింగ్ స్టాఫ్ లో భయాందోళనలు నెలకొన్నాయి. వరుస డ్యూటీ లపై నర్సింగ్ స్టాఫ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల ప్రకారం నర్సింగ్ స్టాఫ్ కి డ్యూటీలు వేయలాని కోరుతున్నా నర్సింగ్ సూపరింటెండెంట్ , కేజీహెచ్ సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదని స్టాఫ్ ఆరోపించారు.

Categories
ANDHRA PRADESH ENTERTAINMENT FEATURED LOCAL WORLD

యూట్యూబ్ విజేత.. కంట్రీఫుడ్స్ మస్తానమ్మ మరిలేరు!

పల్లె వంటల్ని ప్రపంచానికి పరిచయం చేసిన కంట్రీఫుడ్స్ బామ్మ మరిలేరు. పసందైన వంటలతో యూట్యూబ్ అంతటినీ చుట్టేసిన మస్తానమ్మ 107 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం గుడివాడకు చెందిన కర్రె మస్తానమ్మ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో కన్నుమూశారు.

మస్తానమ్మ యూట్యూబ్ చానల్ కంట్రీఫుడ్స్.. రెండేళ్లలో 12 లక్షల మంది సబ్ స్క్రైబర్లను సంపాదించింది. హైదరాబాద్ మీడియాలో పనిచేస్తున్న లక్ష్మణ్, శ్రీనాథ్ రెడ్డి అనే ఇద్దరు స్నేహితులు బామ్మ వంటల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఓ రోజు బామ్మ వండిన వంకాయ కూరను తమ యూట్యూబ్ చానల్లో అప్ లోడ్ చేశారు. అంతే..వెంటనే 75 వేలమంది వరకు చూసేశారు. దీంతో మస్తానమ్మ వీడియోల ప్రస్థానం ప్రారంభమైంది.

KFC చికెన్ కావచ్చు. తండూరి కెబాబ్ కావచ్చు..అది ఎలాంటి వంటయినా సరే..ఊళ్లలో దొరికే వస్తువులతోనే మస్తానమ్మ అవలీలగా వండేసేది. నాన్ వెజ్ ఆమె స్పెషల్. 107 ఏళ్ల వయసులో కూడా ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. వంట పూర్తయిన తర్వాత అందరితో కలిసి తినేది. అవ్వకి 11 ఏళ్లలోనే పెళ్లయిపోయింది. ఐదుగురు సంతానం. చివరికి అబ్బాయి మాత్రమే బతికి ఉన్నాడు. భర్త కూడా తన 22 ఏళ్ల వయసులోనే చనిపోయాడు.

బామ్మ వంటల్ని ఎంతోమంది కాపీ కొట్టారు. ప్రపంచవ్యాప్తంగా గృహిణులెంతోమంది మస్తానమ్మని ఆదర్శంగా తీసుకొని వంటలు నేర్చుకున్నారు. పలువురు అభిమానులు పంపిన డబ్బుతో ఆమె తన 106 వ పుట్టిన రోజు కూడా జరుపుకున్నారు. రానురానూ ఆరోగ్యం క్షీణించడంతో కంట్రీ ఫుడ్స్ చానల్ కి విరామం ఇచ్చారు. ఇప్పుడు శాశ్వతంగా విశ్రమించారు.

[yotuwp type=”videos” id=”3-D_3ujShzw” ]

Categories
ANDHRA PRADESH FEATURED LOCAL

భూధార్ నెంబర్ ఎలా వస్తుంది?

భూధార్ ఎలా కేటాయిస్తారు? : భూ వివరాలను సమగ్రంగా విశ్లేషించి అవి సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత రాష్ట్ర సెన్సస్ కోడ్ 28 తో ప్రారంభమయ్యే పర్మనెంట్ భూధార్ నెంబర్ అందిస్తారు. భూమి వివరాలు తాహశీల్దార్ చేత డిజిటల్ సంతకం చేయబడి వుండాలి. నోషనల్ ఖాతా లో ఉన్న భూములకు భూధార్ ఇవ్వబడదు.

భూసేవ ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం 10 సేవలు అందుబాటులో ఉన్నాయి, మిగిలిన 10 సేవలు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం మ్యుటేషన్, సబ్ డివిజన్, కరక్షన్ కోసం ధరఖాస్తు చేసుకొన్న భూములకు జియో రెఫరెన్సింగ్ చేసి శాశ్వత భూధార్ ఇస్తారు.

మీకు ఆధార్ – మీ భూమికి భూధార్

అసలు ఈ భూసేవ ఏంటి? : భూసేవ ద్వారా ఒక్క క్లిక్ తో భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి భూమికి మరియు స్థిరాస్ధికి ఆధార్ తరహాలో 11 అంకెల భూధార్ విశిష్ఠ సంఖ్యను కేటాయిస్తారు.

భూసేవ ప్రాజెక్టులో రెవిన్యూ, పంచాయితీ రాజ్, మునిసిపల్, రిజిస్ట్రేషన్, సర్వే, అటవీ, దేవాలయ మరియు వక్ఫ్ మొత్తం 8 శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయి. మొత్తం 2 కోట్ల 84 లక్షల వ్యవసాయ భూముల వివరాలు పాటు 50 లక్షల పట్టణ ఆస్తులు మరియు 85 లక్షల గ్రామీణ ఆస్తుల వివరాలను దీని ద్వారా పొందుపరుస్తున్నారు.

[yotuwp type=”videos” id=”ZHw1WnYhTaU” ]

Categories
ANDHRA PRADESH LOCAL

మీకు ఆధార్ – మీ భూమికి భూధార్

అసలు ఈ భూసేవ ఏంటి?  :  భూసేవ ద్వారా ఒక్క క్లిక్ తో భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి భూమికి మరియు స్థిరాస్ధికి ఆధార్ తరహాలో 11 అంకెల భూధార్ విశిష్ఠ సంఖ్యను కేటాయిస్తారు. భూసేవ ప్రాజెక్టులో రెవిన్యూ, పంచాయితీ రాజ్, మునిసిపల్, రిజిస్ట్రేషన్, సర్వే, అటవీ, దేవాలయ మరియు వక్ఫ్ మొత్తం 8 శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయి. మొత్తం 2 కోట్ల 84 లక్షల వ్యవసాయ భూముల వివరాలు పాటు 50 లక్షల పట్టణ ఆస్తులు మరియు 85 లక్షల గ్రామీణ ఆస్తుల వివరాలను దీని ద్వారా పొందుపరుస్తున్నారు.

దేశంలోనే ప్రప్రథమం : కేఈ కృష్ణమూర్తి, రెవెన్యూమంత్రి

దేశంలోనే ఈ తరహా ప్రాజెక్టు ఎక్కడా అమలులో లేదన్నారు డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి. తొలిసారిగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామన్నారు. రెవిన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువగా తీసుకు రావటమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

[yotuwp type=”videos” id=”ZHw1WnYhTaU” ]

 

 

 

 

 

Categories
ANDHRA PRADESH LOCAL

మానవతా మూర్తులారా…కథనానికి దాతల స్పందన!

మానవతామూర్తులారా..ముందుకు రండి..అంటూ విజేత టీవీ ఇచ్చిన పిలుపునకు ప్రపంచవ్యాప్తంగా దాతలు స్పందిస్తున్నారు. GBS అనే అరుదైన వ్యాధి సోకి..ప్రాణాపాయ స్థితిలో ఉన్న బెందాళం సతీష్ తిరిగి కోలుకోవడానికి మేము సైతం అంటూ ఎన్నో దయార్థ్ర హృదయాలు స్పందించాయి. స్పందిస్తూనే ఉన్నాయి. http://www.vijethatv.in/andhrapradesh/youngster-from-srikakulam-suffering-from-rare-disease/ ఈలింక్ ద్వారా విజేత టీవీ అందించిన కథనానికి వీక్షకులు స్పందిస్తూనే ఉన్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో విశ్వవ్యాపితం అయిన విజేత టీవీ మానవవీయ కథనానికి స్పందించి.. ఎవరికి తోచినంత వారు  ఆర్థిక సహాయానికి ముందుకొచ్చారు. చిన్నారులు, విద్యార్థులు సైతం తమ కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న మొత్తాన్ని వెచ్చిస్తున్నారుఇలా చాలామంది సాయానికి ముందుకొస్తున్నారు. సతీశ్ ని ఆదుకోవాలని పిలుపునిచ్చిన వెంటనే స్పందించిన ప్రతి ఒక్కరికి విజేత టీవీ కృతజ్ఞతలు తెలుపుతోంది.

స్పందించే హృదయాల కోసం విజేత టీవీ కథనం లింక్ మరోసారి.. http://www.vijethatv.in/andhrapradesh/youngster-from-srikakulam-suffering-from-rare-disease/

Categories
ANDHRA PRADESH LOCAL

కార్తీక ఏకాదశి రోజున పూజారి శివైక్యం!

ప్రసిద్ధి చెందిన పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం పంచారామా క్షేత్రాల్లో ఒకటి. నాగవెంకట ప్రసాద్ కోట అలియాస్ నాగబాబు పంతులు అక్కడ చాలా ఏళ్లుగా అర్చకునిగా పనిచేస్తున్నారు. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని పూజలు చేస్తున్న నాగబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆలయ సిబ్బంది వెంటనే పూజారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నాగబాబు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

కార్తీక ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని.. మహిషాసుర మర్థిని అమ్మవారికి పూజలు చేస్తుండగా అర్చకునికి గుండెపోటు వచ్చింది. నాగబాబు శివైక్యం ఆలయప్రాంగణంలోనే జరిగింది. కార్తీక ఏకాదశి రోజున అర్చకుని శివైక్యం జరగడం విశేషం.