Categories
FEATURED NATIONAL VIDEOS WORLD

విజేత టీవీ..సకల వర్ణాల సామాన్యుడి సంచిక

అధునాతన సాంకేతిక ప్రపంచంలో విజేత టీవీ ఓ సంచలనం. తొలి మొబైల్ జనరేషన్ టెలివిజన్ గా ఇప్పటికే పేరుగాంచిన విజేత టీవీ ఎప్పుడూ సామాన్యుడి పక్షమే అని సగర్వంగా ప్రకటిస్తోంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్న అంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అరచేతిలో అన్ని వార్తాంశాలు..అడుగడుగునా సామాన్యుడి గొంతుక..వెరసి విజేత టీవీ. వార్తని ఓ సామాజిక బాధ్యతగా తీసుకొని కొత్త తరానికి దిక్సూచిగా మారనుంది విజేత టీవీ. యువతరానికి ఓ నవనిర్మాణ దీపిక. అన్యాయం, వివక్షతో అన్నింటా నష్టపోతున్న బలహీన ప్రజానీకానికి బలమైన వేదిక నిర్మిస్తోంది విజేత టీవీ.

► VIJETHA TV

First Mobile Gen Satellite News Television from Telugu. This Nxt Gen News TV delivers accurate and young news without colors and drama from every corner of the Globe. As Breaking News is meant for sensation, VIJETHA TV breaks the silence and stands for the broken hearts.

No Manipulation..No Manufacturing Consent
No Hidden Agendas..No Conspiracy theories
Simply News at fingertips

For More Updates
► VIJETHA WEB : http://vijethatv.in
► FACEBOOK : https://www.facebook.com/vijethanews/
► YOUTUBE : https://www.youtube.com/channel/UCydxFV9n2dKG9RfFbdq9rjQ
► TWITTER : https://twitter.com/vijethanews
► PINTEREST : https://in.pinterest.com/vijethanews/
► INSTAGRAM : https://www.instagram.com/vijethanews/

Categories
ENTERTAINMENT FEATURED MOVIES

విధివంచితుడు కులశేఖరుడు

వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి..దాగుడు మూతల దండాకోరు..వీరి పేరేమి..!ఇది మనుషులు ఆడే ఆట అని చెబుతారే అంతా..మరి దేవుడు ఆడే ఆట అని తెలిసేదెపుడంట..! “ అవును ఇది దేవుడు ఆడే ఆటే. ఈ ఆటకు అంతే లేదు..ఈ పాట రాసిందీ ఆయనే. దేవుడి ఆటకు బలి అయ్యిందీ ఆయనే. అతడే కులశేఖర్. పాటల రచయిత.

ఉన్నతమైన సాహిత్యం, మది నిండా భావావేశం  కలగలిపి యావత్ తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసిన కులశేఖరుడు చేతికి సంకెళ్లు పడ్డాయి. బండరాయి లాంటి జీవితాల్లో ప్రేమను నింపింది ఆతడి సాహిత్యం.. కాని అతని జీవితం నిండా మాత్రం అంధకారం అలముకుంది. విధివంచితుడైన కులశేఖర్ ఇప్పుడు ఓ ఖైదీ. అదీ గుళ్లో శఠగోపం దొంగిలించే ఖైదీ. అంతుచిక్కని మెదడు సంబంధ వ్యాధి దాడి చేసినప్పటినుంచి తానేంటో..తానెవరో మరచిపోయాడు. భార్య ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటోంది. సోదరులు కూడా కులశేఖర్ మానసిక పరిస్థితిని చూసి చివరకు వదిలేశారు.

చిత్రం, జయం, ఘర్షణ, నువ్వునేను లాంటి దాదాపు వందకి పైగా చిత్రాల్లో పాటలు రాసిన కులశేఖర్.. ఎక్కువగా తేజ, ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్లో పనిచేశారు. తర్వాత అంతు చిక్కని వ్యాధితో ఒక్కసారిగా మాయం అయ్యారు. గుళ్లోకి వచ్చిన వారి బ్యాగు కొట్టేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యక్షం అయ్యారు. కులశేఖర్ గతం గురించి తెలుసుకున్న పోలీసులు క్షమించి విడిచిపెట్టారు.

ఇటీవలే తాను మళ్లీ పాటలు రాయడం మొదలు పెడుతున్నాను అని స్నేహితులతో చెప్పుకున్న కులశేఖర్ తాజాగా ఓ దొంగతనం కేసులో ఇరుక్కున్నారు. చూడండి అప్పటి రచయిత..ఇప్పటి దొంగ. ఇది విధి వైపరీత్యం కాకపోతే మరేంటి. అందుకే విధివంచితుడు కులశేఖరుడు.

Categories
ANDHRA PRADESH CRIME FEATURED LOCAL NATIONAL POLITICS TELANGANA

ఇలాంటి పిరికిపంద చర్యలు నా పోరాటాలను ఆపలేవు- జగన్

తనపై జరిగిన దాడిపట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. భగవంతుడి దయ, కోట్లాదిమంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయన్నారు. ఇటువంటి పిరికిపంద చర్యలు తన ఆత్మ విశ్వాసాన్ని , లక్ష్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. ప్రజల కోసం చేస్తున్న తన పోరాటాలను ఇలాంటి దాడులు ఆపలేవన్నారు జగన్.

https://youtu.be/4RnOOZ1HA_w

Categories
ANDHRA PRADESH CRIME FEATURED LOCAL POLITICS VIDEOS

వైసీపీ అధినేత జగన్ పై దాడి – VIJETHA TV EXCLUSIVE

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగింది. శ్రీనివాస్ అనే వెయిటర్ సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి..జగన్ పై కత్తితో దాడి చేశాడు. వైసీపీకి ఈసారి 160 సీట్లు వస్తాయంటూ జగన్ కి దగ్గరగా వచ్చిన శ్రీనివాస్ అనే కుర్రాడు జగన్ ని కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయం అయ్యింది. ఎయిర్ పోర్ట్ లో ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ వెళ్లారు . ఎయిర్ పోర్ట్ సిబ్బంది శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకొని పోలీసులకి అప్పగించారు. జగన్మోహన్ రెడ్డి ఎయిర్ పోర్ట్ లాంజ్ లో కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది. నిందితుడు శ్రీనివాస్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంగా భావిస్తున్నారు.

ఈ దాడిపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ దాడి కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. జగన్ పై దాడిని హత్యా ప్రయత్నంగా అభివర్ణించారు మిగిలిన వైసీపీ నేతలు.

Categories
ANDHRA PRADESH FEATURED LOCAL NATIONAL POLITICS TELANGANA VIDEOS

విజేత టీవీ..అరచేతిలో వార్తా ప్రపంచం

అధునాతన సాంకేతిక ప్రపంచంలో విజేత టీవీ ఓ సంచలనం. తొలి మొబైల్ జనరేషన్ టెలివిజన్ గా ఇప్పటికే పేరుగాంచిన విజేత టీవీ ఎప్పుడూ సామాన్యుడి పక్షమే అని సగర్వంగా ప్రకటిస్తోంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్న అంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అరచేతిలో అన్ని వార్తాంశాలు..అడుగడుగునా సామాన్యుడి గొంతుక..వెరసి విజేత టీవీ. వార్తని ఓ సామాజిక బాధ్యతగా తీసుకొని కొత్త తరానికి దిక్సూచిగా మారనుంది విజేత టీవీ. యువతరానికి ఓ నవనిర్మాణ దీపిక. అన్యాయం, వివక్షతో అన్నింటా నష్టపోతున్న బలహీన ప్రజానీకానికి బలమైన వేదిక నిర్మిస్తోంది విజేత టీవీ.

#VIJETHA #TV
అంతిమంగా ప్రజలే విజేతలు.

Categories
ANDHRA PRADESH FEATURED LOCAL NATIONAL POLITICS TELANGANA VIDEOS

ప్రజలే విజేతలు.. విజేత టీవీ ఎప్పుడూ సామాన్యుడి పక్షమే!

అధునాతన సాంకేతిక ప్రపంచంలో విజేత టీవీ ఓ సంచలనం. తొలి మొబైల్ జనరేషన్ టెలివిజన్ గా ఇప్పటికే పేరుగాంచిన విజేత టీవీ ఎప్పుడూ సామాన్యుడి పక్షమే అని సగర్వంగా ప్రకటిస్తోంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్న అంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అరచేతిలో అన్ని వార్తాంశాలు..అడుగడుగునా సామాన్యుడి గొంతుక..వెరసి విజేత టీవీ. వార్తని ఓ సామాజిక బాధ్యతగా తీసుకొని కొత్త తరానికి దిక్సూచిగా మారనుంది విజేత టీవీ. యువతరానికి ఓ నవనిర్మాణ దీపిక. అన్యాయం, వివక్షతో అన్నింటా నష్టపోతున్న బలహీన ప్రజానీకానికి బలమైన వేదిక నిర్మిస్తోంది విజేత టీవీ.

అంతిమంగా ప్రజలే విజేతలు.

Categories
ENTERTAINMENT FEATURED MOVIES VIDEOS

బాక్సాఫీస్ బాహుబలి బర్త్ డే గిఫ్ట్

ఇవాళ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ పుట్టిన రోజు. చాలారోజులనుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఆందోళనలో ఉన్న అభిమానులకు ఓ స్వీట్ న్యూస్. షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ వన్ పేరుతో అభిమానులకు పుట్టిన రోజు కానుక దొరికింది.

ఇప్పటికే సాహో సినిమా షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి కావస్తోంది. సుమారు 300కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఇంకా బాలీవుడ్ యాక్టర్లు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, మందిరా బేడీ సాహో సినిమాలో ప్రధాన తారాగణంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకుడు.