Categories
ENTERTAINMENT FEATURED MOVIES

నటుడు శివాజీ రాజాకు గుండెపోటు.. పరిస్థితి విషమం!

నటుడు శివాజీ రాజాకు హార్ట్ స్ట్రోక్.. ఆసుపత్రికి తరలింపు

సీనియర్ నటుడు శివాజీరాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ లో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ సినీ పీఆర్ఓ బీఏ రాజు ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల లాక్ డౌన్ ప్రకటించిన తొలినాళ్లలో శివాజీరాజా తన ఫామ్ హౌస్ లో పండిన కూరగాయలను, ఇతర నిత్యావసరాలను అవసరమైన వారికి ఉచితంగా అందించారు.

Categories
ENTERTAINMENT FEATURED GALLERY MOVIES

అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ ‘పుష్ప’

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న పుష్ప మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యింది
#AlluArjunBirthdayCDP #అల్లు అర్జున్  #విజేతటీవీ #VIJETHATV 

Please Subscribe and Press Bell Icon

https://youtube.com/vijethatv

Categories
ENTERTAINMENT GALLERY MOVIES

ఎన్టీఆర్ ఫ్యామిలీ హోలీ హంగామా

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న ఫ్యామిలీతో క‌లిసి హోలీ వేడుక జ‌రుపుకున్నాడు.

భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అంద‌రికీ హోలీ విషెస్ తెలిపారు తార‌క్‌.

ఫ్యామిలీ స‌భ్యులు అంద‌రు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం చూసిన ఫ్యాన్స్  ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి.

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌, ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు.

ఇటీవ‌ల దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 

Categories
ENTERTAINMENT FEATURED MOVIES

ప్రాణాలతో బయటపడ్డాను.. ఇంకా షాక్‌లో ఉన్నాను: హీరోయిన్ కాజల్

నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘భారతీయుడు -2’ సినిమా షూటింగ్‌ సందర్భంగా నిన్న క్రేన్ కూలి ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటిస్తోన్న కాజల్ ఈ ఘటనపై స్పందిస్తూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. సినీ బృందంలోని మధు (29), చంద్రన్ (60)తో పాటు సహాయ దర్శకుడు కృష్ణ (34) మృతి చెందడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘నా హృదయంలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు. నిన్నటి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేవుడు వారికి మరింత ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను. నిన్న రాత్రి జరిగిన క్రేన్ ప్రమాదంపై నేనింకా షాక్ లోనే ఉన్నాను. త్రుటిలో నేను ప్రమాదం నుంచి తప్పించుకుని ఈ రోజు ట్వీట్ చేస్తున్నాను. ఆ క్షణాన నాకు కాలం, జీవిత విలువ తెలిసింది’ అని తెలిపింది. కాగా, ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.

Categories
CRIME ENTERTAINMENT FEATURED MOVIES

భారతీయుడు – 2 షూట్ లో ప్రమాదం. ముగ్గురు మృతి.

చెన్నై షూటింగ్ లో విషాదం…

‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ లో కింద పడ్డ భారీ క్రేన్…

ప్రమాదంలో ముగ్గురు మృతి…

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా కొనసాగుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్.

చనిపోయిన వారిలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా శంకర్ అసిస్టెంట్ కూడా ఉన్నారు

Categories
ENTERTAINMENT FEATURED GALLERY MOVIES

నితిన్ ఎంగేజ్మెంట్.. ఓ ఇంటివాడు అయినట్లే..

Categories
ANDHRA PRADESH CRIME ENTERTAINMENT GALLERY MOVIES

తెలుగు యువ హీరో ఉదయ్ కిరణ్ మృతి

తూర్పుగోదావరిజిల్లాలో కాకినాడలో టాలీవుడ్ యంగ్ హీరో మృతి చెందాడు. పరారే పరరె, ఫ్రెండ్స్ బుక్ పలు తమిళ సినిమాలు లో హీరోగా నటించిన నండూరి ఉదయ్ కిరణ్ (34) చనిపోయాడు. నిన్న రాత్రి 10.30 గుండెపోటు రావడంతో అతడ్ని హుటుహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో అతడి భౌతిక కాయాన్ని రామారావు పేటలో స్వగృహంకు తరలించారు. ఉదయ్ కిరణ్ మృతిపట్ల పలువురు పెద్దలు , రాజకీయ నాయకులు .. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఉదయ్ కిరణ్ గతంలో డ్రగ్స్ వినియోగం, తాగి పబ్ లో గొడవ చేసిన కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. సినిమా అవకాశం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసగించిన వివాదంతో పలుసార్లు వార్తల్లోకెక్కాడు.

Categories
ENTERTAINMENT MOVIES

పవన్ కొత్త మూవీ ‘విరూపాక్ష’?

చారిత్రక నేపథ్యంలో క్రిష్ సినిమా
బందిపోటు పాత్రలో పవన్ కల్యాణ్
కథానాయిక విషయంలో రావాల్సిన స్పష్టత


ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఆంగ్లేయులను దోచుకునే ఒక బందిపోటుగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ‘వీరు’ అని చెబుతున్నారు.

ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కనుక, ‘విరూపాక్ష’ అనే టైటిల్ ను క్రిష్ పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కైరా అద్వానీని, ఆ తరువాత పూజా హెగ్డేని సంప్రదించగా, డేట్లు ఖాళీ లేవన్నారనే వార్తలు వినిపించాయి. పవన్ నుంచి రానున్న తొలి చారిత్రక చిత్రం కావడంతో, అభిమానులందరిలోను ఆసక్తి వుంది.