Categories
ENTERTAINMENT FEATURED MOVIES

నటుడు శివాజీ రాజాకు గుండెపోటు.. పరిస్థితి విషమం!

నటుడు శివాజీ రాజాకు హార్ట్ స్ట్రోక్.. ఆసుపత్రికి తరలింపు

సీనియర్ నటుడు శివాజీరాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ లో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ సినీ పీఆర్ఓ బీఏ రాజు ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల లాక్ డౌన్ ప్రకటించిన తొలినాళ్లలో శివాజీరాజా తన ఫామ్ హౌస్ లో పండిన కూరగాయలను, ఇతర నిత్యావసరాలను అవసరమైన వారికి ఉచితంగా అందించారు.

Categories
ENTERTAINMENT FEATURED

రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్‌ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. బాలీవుడ్ సీనియర్ హీరో, ప్రస్తుత స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. కేన్సర్‌తో పాటు తాజాగా శ్వాస కోస సమస్య కూడా బాధించడంతో రిషి కపూర్‌ను ఆయన సోదరుడు రణ్‌ధీర్ కపూర్ బుధవారం ఉదయం ఆస్పత్రికి తరలించారు.
ఆమెరికాలో కేన్సర్ చికిత్స పూర్తి చేసుకుని గతేడాది సెప్టెంబర్‌లోనే రిషి భారత్‌కు తిరిగి వచ్చారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రిషి ఈ నెల రెండో తేదీ నుంచి సైలెంట్ అయిపోయారు. ది ఇంటెర్న్ హాలీవుడ్ రీమేక్‌లో దీపికతో కలిసి నటించబోతున్నట్టు ఇటీవల రిషి వెల్లడించిన సంగతి తెలిసిందే. Rishi Kapoor and Irfan Khan https://youtube.com/vijethatv

బుధవారం బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం నుండి పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. 2018లో రిషీకి క్యాన్సర్ బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.ఈ రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు.ఆయ‌న మృతికి సంబంధించిన విష‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్ లో తెలిపారు. అంతేకాదు ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరారు. 1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన రిషీ కపూర్ .. లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండవ కుమారుడు.

1970లో మేరా నామ్ జోక‌ర్ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌య‌మైన రిషి క‌పూర్ ఈ చిత్రానికి గాను నేష‌నల్ అవార్డ్ అందుకున్నారు. ఇక 1973లో బాబీ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించిన ఆయ‌న డింపుల్ క‌పాడియా స‌ర‌స‌న న‌టించాడు. ఈ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డ్ కూడా ద‌క్కింది . 1973-2000 మ‌ధ్య 92 సినిమాలు లీడింగ్ రోల్ చేశాడు. అందులో చాలా చిత్రాలు బాక్సాఫీస్ హిట్ కొట్టాయి. ఇటీవ‌ల 102 నాటౌట్ అనే చిత్రంలో అమితాబ్‌తో క‌లిసి న‌టించారు రిషి. ఇందులో చిన్న‌పిల్ల‌లా న‌టించి అల‌రించారు. చివ‌రిగా ది బాడీ అనే చిత్రంలో న‌టించగా, శ‌ర్మాజీ న‌మ్‌కీన్ చిత్రం సెట్స్ పై ఉంది.

రిషి కూపూర్ 1952 సెప్టెంబ‌ర్ 4న మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించారు. న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అత‌నికి భార్య నీతూ సింగ్‌, పిల్ల‌లు రిద్దిమా క‌పూర్, ర‌ణ్‌భీర్ క‌పూర్ ఉన్నారు. ఇటీవ‌లి కాలంలో రిషీ క‌పూర్ ఎక్కువ‌గా సంచ‌ల‌న ట్వీట్స్‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతూ వ‌చ్చారు. ముక్కు సూటిగా మాట్లాడే ఆయ‌న ధోర‌ణి చాలా మందికి న‌చ్చుతుంది. ఎన్నో అవార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకున్న రిషి క‌పూర్ అభిమానుల ప్రేమ‌ని అంత‌క‌న్నా ఎక్కువ‌గా పొందాడు. రిషి క‌పూర్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో బాలీవుడ్ సినీ పరిశ్ర‌మ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు శోక సంద్రంలో మునిగారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధిస్తున్నారు.

Categories
ENTERTAINMENT FEATURED GALLERY MOVIES

అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ ‘పుష్ప’

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న పుష్ప మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యింది
#AlluArjunBirthdayCDP #అల్లు అర్జున్  #విజేతటీవీ #VIJETHATV 

Please Subscribe and Press Bell Icon

https://youtube.com/vijethatv

Categories
ENTERTAINMENT FEATURED NATIONAL

కరోనాతో బాధపడుతున్న ఫేమస్ సింగర్ కనికా ఆరోగ్యం విషమం.

ప్రఖ్యాత పాప్, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇప్పటికే మూడు శాంపిళ్ళు పాజిటివ్ వచ్చిన కనిక కు నాలుగవ శాంపిల్ కూడా పాజిటివ్ వచ్చిందని, వైద్యానికి ఆమె శరీరం ప్రతిస్పందించడం లేదని, దేవుడిని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేక పోతున్నామని వాపోయారు కుటుంబ సభ్యులు

Categories
GALLERY

జనసేన ఆవిర్భావ దినోత్సవ గ్యాలరీ

Categories
ENTERTAINMENT GALLERY MOVIES

ఎన్టీఆర్ ఫ్యామిలీ హోలీ హంగామా

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న ఫ్యామిలీతో క‌లిసి హోలీ వేడుక జ‌రుపుకున్నాడు.

భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అంద‌రికీ హోలీ విషెస్ తెలిపారు తార‌క్‌.

ఫ్యామిలీ స‌భ్యులు అంద‌రు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం చూసిన ఫ్యాన్స్  ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి.

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌, ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు.

ఇటీవ‌ల దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 

Categories
ENTERTAINMENT FEATURED TELANGANA

తెలంగాణలో మహిళా భద్రత ఎక్కువ : సాయి పల్లవి

పోలీసులపై సాయిపల్లవి ప్రశంసలు!

హైదరాబాద్ :- తెలంగాణ పోలీసులపై ప్రముఖ సినీ నటి సాయిపల్లవి ప్రశంసల జల్లు కురిపించారు. ఇవాళ నగరంలోని హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో షీ ఎంపవర్ ఉమెన్స్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి సాయిపల్లవి, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నిజంగా గ్రేట్.
ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ.. మహిళల కోసం తెలంగాణ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా గ్రేట్ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మహిళలకు ఉన్న భద్రత ఎక్కడా లేదని పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. సిటీకి చదువు, ఉద్యోగాల కోసం వచ్చే యువతులు గతంలో చాలా భయపడేవారని అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. పోలీసులకు సహకరించడం మన బాధ్యత అని యువతకు సాయిపల్లవి సూచించారు…

Categories
ENTERTAINMENT FEATURED MOVIES

ప్రాణాలతో బయటపడ్డాను.. ఇంకా షాక్‌లో ఉన్నాను: హీరోయిన్ కాజల్

నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘భారతీయుడు -2’ సినిమా షూటింగ్‌ సందర్భంగా నిన్న క్రేన్ కూలి ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటిస్తోన్న కాజల్ ఈ ఘటనపై స్పందిస్తూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. సినీ బృందంలోని మధు (29), చంద్రన్ (60)తో పాటు సహాయ దర్శకుడు కృష్ణ (34) మృతి చెందడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘నా హృదయంలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు. నిన్నటి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేవుడు వారికి మరింత ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను. నిన్న రాత్రి జరిగిన క్రేన్ ప్రమాదంపై నేనింకా షాక్ లోనే ఉన్నాను. త్రుటిలో నేను ప్రమాదం నుంచి తప్పించుకుని ఈ రోజు ట్వీట్ చేస్తున్నాను. ఆ క్షణాన నాకు కాలం, జీవిత విలువ తెలిసింది’ అని తెలిపింది. కాగా, ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.