Categories
ANDHRA PRADESH CRIME

రంగనాయకి తో పాటు రఘునాద్ కు సీఐడీ నోటీసు

సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై కొరడా జుళిపిస్తున్న ఏపీ సీఐడీ

విశాఖ ఎల్జి పాలిమర్స్ గ్యాస్ విషయంలోతప్పుడు ప్రచారం చేసిన వారికి బిగుస్తున్న ఉచ్చు

ప్రజలని రెచ్చగొట్టే విదంగా పోస్టింగ్ పెట్టిన రంగనాయకమ్మ పై కేసునమోదు

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన హైదరాబాద్ కు చెందిన రఘునాద్ కు సీఐడీ నోటీసు

సున్నితమైన అంశంలో ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగింది -సీఐడీ ఎస్పీ సరిత

ఏ వయసు వారు తప్పుచేసినా శిక్ష తప్పదు -సీఐడీ ఎస్పీ సరిత

ప్రజలను అయోమయానికి గురిచేసేలా ఎవరు ప్రచారం చేసినా శిక్ష తప్పదు -సీఐడీ ఎస్పీ సరిత

మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ళ జైలుశిక్ష ,ఐదులక్షల జరిమానా విదిస్తుంది -సీఐడీ ఎస్పీ సరిత

రెండోసారీ తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష పదిలక్షల జరిమానా విదిస్తుంది -సీఐడీ ఎస్పీ సరిత

Categories
ANDHRA PRADESH CRIME FEATURED

విశాఖ ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా

ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘ఈ సంఘటనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది.

ఇక మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. జరిగిన దుర్ఘటనలో చనిపోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా… మనసున్న మనిషిగా బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం. అంతేకాకుండా హాస్పటల్‌లో వైద్యం పొందుతున్నవారికి కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. బాధితులు కోలుకునేవారకూ వారికి చికిత్స అందిస్తాం. మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం.

ఎల్జీ లాంటి గుర్తింపు ఉన్న సంస్థలో ఇలాంటి దుర్ఘటనలు జరగటం బాధాకరం. గ్యాస్‌ లీక్‌ అయినప్పుడు అలారం ఎందుకు మోగలేదో తెలియరాలేదు. మరోవైపు సంఘటన జరిగిన వెంటనే అధికారులు సమర్థవతంగా పని చేశారు. ఉదయం 4 గంటల నుంచే కలెక్టర్‌, ఎస్పీ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు’ అని తెలిపారు. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకై తొమ్మిదిమంది మృతి చెందగా, సుమారు 200మంది అస్వస్థతకు గురయ్యారు

Categories
ANDHRA PRADESH CRIME NATIONAL

జూమ్ యాప్ తో భద్రతకు ముప్పు!

జూమ్ యాప్ తో వీడియో కాన్ఫరెన్స్ శ్రేయస్కరం కాదన్న కేంద్ర హోం శాఖ

లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూమ్ యాప్ ను వినియోగిస్తున్నారని, ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదని కేంద్ర హోం శాఖ సూచించింది.

భద్రతాపరంగా ఈ యాప్ ను వినియోగించవద్దని ప్రైవేట్ సంస్థలకు సూచిస్తూ ఓ ప్రకటన చేసింది. కాగా, లాక్ డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు భద్రత లేకుండా పోయిందని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి.

Categories
CRIME FEATURED TELANGANA

అమృతకి చిల్లిగవ్వ కూడా రాయలేదు.. మారుతీరావు ఆస్తులు ఇన్ని వందల కోట్లా!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ ప్రేమ వివాహం ఆపై ప్రణయ్ ని అమృత తండ్రి మారుతీరావు అంతమొందించడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మారుతీరావు ఆత్మహత్య కూడా అంతే సంచలనం. ఈ పరిస్థితుల్లో మారుతీరావు ఆస్తుల వివరాలను పోలీసులు కోర్టు ముందుంచారు

రావు భార్య, తమ్ముడి పేరు మీదనే వీలునామా రాసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం మారుతీరావు ఆస్తుల విలువ రూ.200 కోట్లుగా లెక్క ఉందట. మొదట కిరోసిన్ డీలర్‌గా వ్యాపారం చేసిన మారుతీరావు.. తర్వాత రైస్ మిల్లుల బిజినెస్ మొదలు పెట్టారు. అనంతరం రైస్ మిల్లులు అమ్మి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. అలాగే.. మారుతీరావుకి బినామీలు కూడా ఉన్నట్లు అమృత కూడా చెప్పింది. మరి బినామీల లెక్కన ఇంకెంత ఆస్తి ఉందో తెలియాలి.

చార్జ్ షీట్‌లో మారుతీరావు ఆస్తుల వివరాలు:

1. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో వంద విల్లాలు విక్రయం
2. అమృత ఆస్పత్రి పేరుతో వంద పడకల ఆస్పత్రి
3. భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి
4. హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం
5. హైదరాబాద్‌లో పలు చోట్ల 5 ఫ్లాట్లు
6. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్
7. ఈదులగూడెం క్రాస్ రోడ్‌లో మరో షాపింగ్ మాల్
8. మారుతీ రావు తల్లి పేరుతో రెండంతస్తుల భవనం
9. మిర్యాల గూడ బైపాస్ రోడ్‌లో 22 గుంటల భూమి

Categories
ANDHRA PRADESH CRIME FEATURED

ప్రభుత్వ ఆస్పత్రులపై ఏసీబీ దాడులు!

ఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల వరుస దాడులు దడ పుట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయాలను, టౌన్ ప్లానింగ్ ఆఫీసులను టార్గెట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాలలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులపై ఏసీబీ అధికారుల దాడులు

అవినీతి అధికారులకు ఏసీబీ చెమటలు పట్టిస్తుంది ఏపీలో ప్రతి శాఖలోనూ పారదర్శకంగా పనులు జరగాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన నేపధ్యంలోనే ఏసీబీ అధికారులు వరుస దాడులను కొనసాగిస్తున్నారు. మందుల కొనుగోలులో చేతివాటం కొనసాగినట్టు తెలుస్తుంది. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో జరిగిన మోసాల నేపధ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

మందులు , వైద్య పరికరాల కొనుగోళ్ళపై తనిఖీలు

మందుల కొనుగోళ్ళు, వైద్య పరికరాల కొనుగోళ్ళు , వైద్యాధికారుల హాజరు, గైర్హాజరుకు సంబంధించి సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రైవేట్ క్లినిక్ లను ఏర్పాటు చేసుకున్న వైద్యులు చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు గైర్హాజరు అవుతున్నట్టు గుర్తించినట్టు సమాచారం . ఇక అవుట్ పేషెంట్ , ఇన్ పేషంట్ రిజిస్టర్ లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం . ప్రధానంగా మందుల కొనుగోళ్ళు, నాశిరకం మందుల కొనుగోలు చేసి పెట్టిన బిల్లులపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

100 మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు

దాదాపు 100 మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో అన్ని జిల్లాలలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక విశాఖపట్నం , గుంటూరు, విజయనగరం, నెల్లూరు, అనంతపురం, తూర్పు గోదావరి, కడపతో పాటు అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు కీలకమైన అనేక అంశాలను గుర్తించారు.

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొనుగోళ్లలో భారీ స్కామ్ నేపధ్యంలో సోదాలు

ఒక పక్క వైసీపీ సర్కార్ ఆరోగ్య శాఖను ప్రక్షాళన చెయ్యాలని భావిస్తున్న తరుణంలో జరుగుతున్న ఏసీబీ దాడులు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించకుండా ప్రైవేట్ వైద్య శాలలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా వున్నట్టు తెలుస్తుంది. ఇక ఈఎస్ఐ ఆస్పత్రుల కుంభకోణం తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మందుల కొనుగోళ్లలో భారీ గోల్ మాల్ జరిగిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Categories
ANDHRA PRADESH CRIME FEATURED POLITICS

వైసీపీ ఎమ్మెల్యే రజినీ కారుపై దాడి. ఇరువర్గాల కొట్లాట!

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కోటప్పకొండ సమీపంలో కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే రజనీ మరిది గోపీ… కోటప్పకొండకు వెళ్లి ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఐతే… కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నారన్న ఉద్దేశంతో దుండగులు… కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దాంతో కారు ధ్వంసమైంది.

తీరా చూస్తే… అందులో రజనీ లేరనీ… ఆమె మరిది గోపీ మాత్రమే ఉన్నారని తెలిసింది. ఇంతలో వైసీపీ కార్యకర్తలు అక్కడకు రావడంతో… ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థులు, వైసీపీ కార్యకర్తలూ కొట్టుకున్నట్లు తెలిసింది. చివరకు రెండు వర్గాల వారికీ స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఐతే… కారుపై టీడీపీ కార్యకర్తలే దాడికి దిగారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో రాజకీయ వేడి రగులుతోంది.

Categories
CRIME ENTERTAINMENT FEATURED MOVIES

భారతీయుడు – 2 షూట్ లో ప్రమాదం. ముగ్గురు మృతి.

చెన్నై షూటింగ్ లో విషాదం…

‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ లో కింద పడ్డ భారీ క్రేన్…

ప్రమాదంలో ముగ్గురు మృతి…

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా కొనసాగుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్.

చనిపోయిన వారిలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా శంకర్ అసిస్టెంట్ కూడా ఉన్నారు

Categories
CRIME FEATURED TELANGANA

లో దుస్తుల్లో బంగారం.. దొరికిన మహిళ!

హైదరాబాద్, విజేత టీవీ :- శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత. సుడాన్ దేశస్తురాలి వద్ద 233.2 గ్రాముల అక్రమ బంగారం పట్టివేత. దుబయ్ నుండి హైదరాబాద్ వచ్చిన మహిళ. నింధితతురాలు బంగారాని వివిధ రకాలైన అభరణల రూపంలో, తయారు చేసి వేసుకున్న. షు లలో లోదుస్తులలో, బంగారం తరలిస్తుండగా, పట్టుబడింది.
పట్టుబడ్డ బంగారం విలువ 11 లక్షలు ఉంటుందని ఆధికారులు వెల్లడించారు…