సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

51

టిడిపి ఎంపీ సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఈడీ ముందు హాజరుకావడం నుంచి తనను తప్పించాలంటూ చేసుకున్న విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.ఈడీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

బ్యాంకులకు 5700 కోట్ల మేర మోసం చేశారన్న అభియోగంపై ఈడీ సమన్లు జారీ చేసింది. వివరణ ఇచ్చుకోవాలని సుజనాచౌదరికి స్పష్టం చేసింది. అయితే ఈడీ ముందు హాజరుపై మినహాయింపు కోరుతూ సుజనా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

కేంద్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని..రాజకీయంగా కక్ష సాధిస్తోందని కోర్టుకు మొరపెట్టుకున్నారు సుజనా చౌదరి. అయితే సుజనా విజ్ఞప్తిని ఆలకించిన న్యాయస్థానం విచారణకు హాజరవ్వాల్సిందేనని చెప్తూనే.. నిర్బంధించరాదని ఈడీకి స్పష్టం చేసింది. దీంతో సుజనాకి కొంత మోదం మరికొంత ఖేదం కలిగినట్లైంది.