Categories
ANDHRA PRADESH

ప్రముఖ వ్యాపార వేత్త, సీనియర్ బీజేపీ నేత కాటూరి రవీంద్రకు శుభాకాంక్షల వెల్లువ.

ఏపీ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త కాటూరి రవీంద్ర కు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అర్ధరాత్రి నుంచే జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఢిల్లీ నుంచి సీనియర్ బీజేపీ నేతలు పలువురు ఫోన్ చేసి కాటూరి రవీంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా ఆపత్కాలంలో కాటూరి సూరన్న ట్రస్ట్ ద్వారా పేదలకు అందిస్తున్న సాయంపై కాటూరి రవీంద్రను ప్రశంసించారు. రానున్న కాలంలో మరిన్ని సేవలు అందించడానికి తమ పూర్తి సహకారం ఉంటుందని రవీంద్రకు హామీ ఇచ్చారు

స్నేహశీలి, నిగర్వి, ఆపత్కాలంలో నేనున్నా అంటూ ముందుకొచ్చే రవీంద్ర కాటూరి ఇటీవల కాలంలో సామజిక సేవలు ఉదారంగా, ఉధృతంగా నిర్వహిస్తున్నారు. కరోనా కల్లోలం సామాన్యుణ్ణి పెకిలిస్తుంటే.. నిరుపేదలకు కొండంత అండగా నిలిచారు. నిరుపేదలకు నిత్యావసరాలు అందించి ఆదుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు, జర్నలిస్టులకు నిత్యవసరాలతో పాటుగా ఆర్ధిక సాయం అందించారు. నోరులేని మూగ జీవాల కోసం పశుగ్రాసం సరఫరా చేయించారు. విశాఖ కేంద్రంగా దశబ్ధంన్నర కాలంగా కాటూరి రవీంద్ర పార్టీలకతీతంగా విరివిగా సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న కాటూరి రవీంద్ర కరోనా సమయంలో చేసిన సేవల్ని గుర్తించి అధిష్టానం ప్రశంసించింది.

ప్రముఖ వ్యాపారవేత్త అయిన కాటూరి రవీంద్రకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఢిల్లీ హోం పేషీతో పాటు, బీజేపీ సీనియర్ నేతలు రఘునందన్, మహిళా సీనియర్ నేతలు, ఏపీ బీజేపీ ప్రముఖులు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలనుంచి వైసీపీ, జనసేన ఇంకా పలు పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఏపీ సెక్రటేరియట్ సిబ్బంది , విశాఖ జిల్లా సీనియర్ లీడర్లు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

తెలంగాణ