డిజిపిని మార్చండి : సిఈసికి ఏపీ బిజెపి విజ్ఞప్తి

39

ఏపీ డిజిపిపై కంప్లైంట్ చేసిన జాబితాలో బిజెపి కూడా చేరింది. డేటా చోరీ , ఫారం 7 వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర బిజెపి ఫిర్యాదు చేసింది. ఏపీ డీజీపీని మార్చేయాలంటూ ఢిల్లీలోని సిఈసిని కోరింది. ఈ సందర్భంగా ఏపీ సిఎం చంద్రబాబు, ఆయన పాలనపై విమర్శలు గుప్పించారు ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.


టీడీపీకి అనుకూలంగా లేనివాళ్ల ఓట్లు తొలగిస్తున్నారని, తక్షణమే థర్డ్ పార్టీ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఈసీని కోరారు. తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని కోరామని మీడియాకు తెలిపారు. అధికారులు కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. డీజీపీని మార్చాలని ఎన్నికల సంఘానికి విజ్ఞ‌ప్తి చేశామన్నారు. ఆధార్‌, ఓటర్ల జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.


ఏపీ పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఫారం-7ను ఎవరైనా దరఖాస్తు చేయొచ్చని.. అది నిజమో కాదో ఎన్నికల సంఘం తేలుస్తుందన్నారు. ఆధార్‌, ఓటర్‌ డేటాను ఏపీ ప్రభుత్వం దొంగిలించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు

7 COMMENTS

  1. I’m really impressed with your writing skills and also with the layout on your blog. Is this a paid theme or did you customize it yourself? Anyway keep up the nice quality writing, it is rare to see a great blog like this one nowadays..

  2. “Excellent read, I just passed this onto a colleague who was doing a little research on that. And he just bought me lunch because I found it for him smile Thus let me rephrase that Thank you for lunch!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here