Thursday, June 24, 2021
Home Prime Politics ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్న కేసీఆర్

ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్న కేసీఆర్

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని భారత పౌరుడు కాదని అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం. చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మొదటి సారి ఈ కేసు పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవి కిరణ్ కోరగా…

చెన్నమనేని పౌరసత్వ వివాదం పై మరోసారి విచారించింది హైకోర్టు. అయితే ఎమ్మెల్యే బలమైన నేత కావడం, ఆర్ధికంగా బలంగా ఉండటంతో సిఎం కేసీఆర్ కూడా కాస్త గట్టిగానే పోరాటం చేసే అవకాశాలు ఉండవచ్చు. కౌంటర్ దాఖలుకు వారం గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విచారణ ఈ నెల 18కి హైకోర్టు వాయిదా వేసింది

- Advertisment -

Most Popular

Recent Comments