Thursday, June 24, 2021
Home Uncategorized తెలంగాణా బడ్జెట్ హైలెట్స్

తెలంగాణా బడ్జెట్ హైలెట్స్

కరోనా తర్వాత దేశంలో ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇక రాష్ట్రాలు కూడా ఆర్ధికంగా నానా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇక 2021-20 22 తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టారు. రాష్ర్ట బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు ప్రవేశ పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లుగా తెలిపారు. ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు వేసారు.

పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు గా ఉందని, వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎస్సీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు కేటాయించామని చెప్పారు. ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు కేటాయించామని వివరించారు. నేత‌న్న‌ల సంక్షేమం కోసం రూ. 338 కోట్లు కేటాయించామని వివరించారు.

బీసీ కార్పొరేష‌న్‌, అత్యంత వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కార్పొరేష‌న్‌కు రూ. 1000 కోట్లు కేటాయించామని అన్నారు. మొత్తంగా బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 5,522 కోట్లు కేటాయించామని చెప్పారు. ప‌ల్లెప్ర‌గ‌తి కింద ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామ‌పంచాయ‌తీల‌కు రూ. 5,761 కోట్ల నిధులు విడుద‌ల‌ చేసామని అన్నారు. తొలిసారిగా రాష్ర్ట ప్ర‌భుత్వ బ‌డ్జెట్ నుంచి మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 500 కోట్ల నిధులు ఇస్తాం అన్నారు.

ఇందులో జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 252 కోట్లు, మండ‌ల పరిష‌త్‌ల‌కు రూ. 248 కోట్లు ఇస్తాం అని తెలిపారు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ. 29,271 కోట్లు ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కోసం రూ. 5 కోట్లు అని ఆయన వెల్లడించారు. వ్య‌వ‌సాయ రంగానికి రూ. 25 వేల కోట్లు కేటాయించామని అన్నారు. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు రూ. 1500 కోట్లు కేటాయించామని చెప్పారు.

రైతుబంధు ప‌థ‌కానికి రూ. 14,800 కోట్లు, రైతు రుణ‌మాఫీకి రూ. 5,225 కోట్లు, రైతు బీమా ప‌థ‌కానికి రూ. 1200 కోట్ల‌కు పెంపు, ప‌శు సంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య‌శాఖ‌కు రూ. 1,730 కోట్లు కేటాయించామని చెప్పారు. సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు కేటాయించామని ఇవరించారు. స‌మ‌గ్ర భూ స‌ర్వే కోసం రూ. 400 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 11,728 కోట్లు కేటాయించామని చెప్పారు.

- Advertisment -

Most Popular

Recent Comments