Thursday, June 24, 2021
Home Prime Politics స్పీడ్ పెంచిన సోము... సుజనా, సిఎం రమేష్ కు కూడా కీలక బాధ్యతలు

స్పీడ్ పెంచిన సోము… సుజనా, సిఎం రమేష్ కు కూడా కీలక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని రెవెన్యూ జిల్లాలకు ఇన్ఛార్జిలు, సమన్వయకర్తలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఇంచార్జీలు గా జి.వి.ఎల్ నరసింహారావు, కంభంపాటి హరిబాబు, పి.వి.ఎస్ మాధవ్, విష్ణు కుమార్ రాజు, కాశీ విశ్వనాథ రాజుని నియమించారు.

Somu Veerraju is new president for AP BJP

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ్ణా జిల్లాలకు ఇంచార్జీలు గా సుజనా చౌదరి, డాక్టర్ కామినేని శ్రీనివాస్, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణ ని నియమించారు. గుంటూరు, ఒంగోలు జిల్లాలకు ఇంచార్జీలు గా కన్నా లక్ష్మి నారాయణ , రావెల కిషోర్ బాబుని నియమించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఇంచార్జీలు గా సిఎం రమేష్ , ఆదినారాయణ రెడ్డి, వాకాటి నారాయణ రెడ్డిని నియమించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఇంచార్జీలుగా టి.జి వెంకటేష్ , ఎం.ఎస్ పార్థసారథి, వరదాపురం సూర్య నారాయణ (సూరి), డాక్టర్ పార్థసారథిని నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments