Thursday, June 24, 2021
Home Uncategorized జగన్ కు షర్మిలకు ఆస్తి తగాదాలు... మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జగన్ కు షర్మిలకు ఆస్తి తగాదాలు… మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్ కుటుంబంలో కలహాలతోనే షర్మిళ పార్టీ పెడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. షర్మిల కు జగన్ లోకసభ సీటు .. రాజ్యసభ సీటు ఇవ్వలేదు అని, జగన్ కు షర్మిలకు కుటుంబం లో ఆస్తి తగాదాలు ఉన్నాయి అన్నారు. గతంలో చిరంజీవి పార్టీ వల్ల అమాయకులు బలైయ్యారు అని ఆయన గుర్తు చేసారు.

చాలా మంది భూములు అమ్మి వచ్చి సర్వస్వం కోల్పోయారు అన్నారు. ఇప్పుడు షర్మిళ పార్టీ కూడా అదే తరహా లో నడుస్తుంది అని మండిపడ్డారు. ఇలా పార్టీ లు పెట్టి ఇతరులను ముంచొద్దు అని సూచించారు. విజయమ్మ గారి ఆశీర్వాదం షర్మిల కు ఉంది అన్నారు. అందుకే అందరిని కలవమని విజయమ్మ ఫోన్ చేస్తోంది అని, తెలంగాణ లో పార్టీ పెట్టీ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టను దిగదార్చుకోవొద్దు అని సూచించారు.

- Advertisment -

Most Popular

Recent Comments