Tuesday, June 22, 2021
Home Uncategorized ఆ రైతుల నెత్తిన జగన్ పాలు పోసినట్టేనా...?

ఆ రైతుల నెత్తిన జగన్ పాలు పోసినట్టేనా…?

ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ సెజ్ కోసం తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కాకినాడ సెజ్ దేశంలోనే పెద్దది అని ఆయన అన్నారు. 10 వేల ఎకరాలను సేకరించి సెజ్ ఏర్పాటు చేశారు అని పేర్కొన్నారు.

TDP MP seeks CM YS Jagan Mohan Reddy explanation on Delhi visit- The New  Indian Express

గత ప్రభుత్వాలు రైతుల పై ఉక్కు పాదం మోపి భూములు తీసుకున్నాయి అని ఆరోపించారు. భూములు ఇచ్చి పరిహారం తీసుకొని రైతుల అభిప్రాయం తీసుకుని సీఎం కు నివేదిక ఇచ్చాం అని తెలిపారు. సెజ్ లో భూములు ఇచ్చి పరిహారం వద్దని తిరస్కరించిన రైతులకు చెందిన 2,180 ఎకరాలు వెనక్కు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది అన్నారు. ఆరు గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు రైతుల పై వందలాది కేసులు పెట్టారు అని ఆరోపించారు. వాటిని కూడా ఎత్తివేసేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే రాష్ట్ర చట్టాన్ని కూడా సెజ్ లో అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది అని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments