Wednesday, July 28, 2021
Home Trending Topic ప్రవీణ్ పుల్లటకు ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్

ప్రవీణ్ పుల్లటకు ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్

ట్రై నెక్స్ట్ మీడియా అధినేత , రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రవీణ్ పుల్లటకి 2020-21 సంవత్సరానికి గాను “ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు దక్కింది. డిజిటల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో విశేష ప్రగతి సాధించినందుకు ఎంట్రప్రెన్యూర్ షిప్ కేటగిరీలో ఈ అవార్డు లభించింది.


ప్రముఖ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ అవార్డు కమిటీ దేశవ్యాప్తంగా వివిధ ఎంట్రీలను పరిశీలించిన తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్త పుల్లట ప్రవీణ్ ని ఈ అవార్డుకి ఎంపిక చేసింది. సదరు యూనివర్సిటీ ఏటా విభిన్న రంగాల్లో విజయం సాధించిన వారికి అవార్డులతో సత్కరిస్తుంది.

సీనియర్ టీవీ జర్నలిస్ట్ అయిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా డిజిటల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారంలో ఉన్నారు. విజేత టీవీ, ఏపీ టీవీలను నడపడమే కాకుండా మీడియా కన్సల్టెంట్ గా కూడా కొనసాగుతున్నారు. రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గతంలో టీవీ9, సాక్షి టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు హోదాలో పని చేశారు.

ప్రవీణ్ పుల్లట స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని భైరిపురం గ్రామం. ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కడంపై ప్రవీణ్ స్పందన ఆయన మాటల్లోనే.. ” ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచింది. దాదాపుగా 19ఏళ్లుగా మీడియా రంగంలో కొనసాగుతున్నాను. మా సొంత సంస్థ ద్వారా ఇప్పటికే పలు మీడియా ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్నాము. త్వరలో జాతీయ స్థాయిలో అధునాతనమైన వీడియో కంటెంట్ తో న్యూస్ యాప్ విడుదల చేస్తున్నాము. తెలుగు, తమిళం,.హిందీ, కన్నడ భాషల్లో ఈ యాప్ ఉంటుంది. మార్కెట్లో ఇప్పటివరకు ఇలాంటి వీడియో న్యూస్ యాప్ రాలేదు.

ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ మీడియా కాలం. రానున్న రోజుల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా డిజిటల్ వెర్షన్ లోనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 1000 బిలియన్ డాలర్ల వ్యాపారం జరగ నుంది.”

-ప్రవీణ్.పుల్లట, ట్రై నెక్స్ట్ మీడియా అధినేత

- Advertisment -

Most Popular

Recent Comments