Thursday, June 24, 2021
Home State Affairs ఎన్ని భూములు స్వాధీనం చేసుకున్నారు..? తెలంగాణా హైకోర్ట్ ఫైర్

ఎన్ని భూములు స్వాధీనం చేసుకున్నారు..? తెలంగాణా హైకోర్ట్ ఫైర్

వక్ఫ్‌ బోర్డు స్థలాల ఆక్రమణలపై టీఎస్ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా 2,186 ఆస్తుల ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామని ప్రభుత్వం హైకోర్ట్ కి తెలిపింది. అందులో ఎన్ని స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని హైకోర్టు కోరింది. ఆస్తుల స్వాధీనం వివరాలు లేకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారా? అని అడిగిన హైకోర్టు… కొన్ని కీలక ప్రశ్నలు వేసింది.

టాస్క్‌ఫోర్స్‌లో ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు? చెప్పాలని ఆదేశించింది. జిల్లాల వారీగా వివరాలు సమర్పించాలన్న టీఎస్ హైకోర్టు… తదుపరి విచారణ జూన్‌ 10కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. విపక్షాలు ఈ అంశంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisment -

Most Popular

Recent Comments