Thursday, June 24, 2021
Home State Affairs స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య లేఖ... చావుకి ముహూర్తం కూడా

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య లేఖ… చావుకి ముహూర్తం కూడా

ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం కాస్త సీరియస్ గా ఉంది. ఈ అంశంలో అధికార పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే స్టీల్ ఫ్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసారు. ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం అని పేర్కొన్నారు. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి అని తెలిపారు.

32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం అని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు అని కోరారు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను అని… ఈ రోజు అగ్నికి ఆహుతి కావడానికి 5:49 నిమషాలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి అని సంచలన లేఖ రాసారు.

- Advertisment -

Most Popular

Recent Comments