Thursday, June 24, 2021
Home State Affairs ఆ భయం చంద్రబాబులో క్లియర్ గా ఉందా...?

ఆ భయం చంద్రబాబులో క్లియర్ గా ఉందా…?

దర్యాప్తులో భాగంగా చంద్రబాబుకి నోటీస్ ఇచ్చారు అని వైసీపీ అగ్ర నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబులో భయం క్లియర్ గా కనిపిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చారు.. ఎలాంటి కక్ష సాధింపులు లేవు అని స్పష్టం చేసారు. తప్పు చెయ్యనప్పుడు ధైర్యంగా విచారణకు హాజరుకావాలి అని ఆయన సూచించారు. దళితుల ఆస్తికి హక్కులకు భంగం కలిగింది కనుక అట్రాసిటీ కేసు పెట్టారు అన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగంగానే తక్కువకి భూములు లాక్కున్నారు అని, ఇదంతా పెద్ద మోసం అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు విచారణకు హాజరు అయితే బాగుంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆర్కే కి కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది అని సజ్జల వివరించారు.

- Advertisment -

Most Popular

Recent Comments