Thursday, June 24, 2021
Home State Affairs వైసీపీ ఎమ్మెల్యేని శపించిన లోకేష్...?

వైసీపీ ఎమ్మెల్యేని శపించిన లోకేష్…?

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. లోకేష్ గెలిస్తే మంగళగిరి లో పేదల ఇళ్లు కూల్చేస్తాడు అని ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసారు వైకాపా నేతలు అని, ఇప్పుడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం లేకుండా రోజుకో చోట పేదల గూడు కూల్చేస్తున్నాడు అని మండిపడ్డారు. ఈ పాపం ఆయన్ని ఊరికే వదలదు అని హెచ్చరించారు.

మంగళగిరి నియోజకవర్గం,ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు. ఇళ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నా ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు,పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి నెట్టేసారు అని ఆవేదన వ్యక్తం చేసారు. రెండేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కట్టని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవడిచ్చాడు? అని ప్రశ్నించారు.

- Advertisment -

Most Popular

Recent Comments