Tuesday, June 22, 2021
Home State Affairs గుంటూరు జిల్లాలో మరో నగరం

గుంటూరు జిల్లాలో మరో నగరం

గుంటూరు జిల్లాలో గుంటూరుకు తోడు మరో నగరం ఏర్పాటు చేస్తున్నారు. ఎంటీఎంసిలో మంగళగిరి, తాడేపల్లి విలీనం చేస్తున్నారు. ఒకే కార్పొరేషన్‌గా రెండు పట్టణాలు, 21 గ్రామాలు ఉంటాయి. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. అమరావతి మహా నగరపాలక సంస్థ ప్రతిపాదనకు గండి కొట్టారు. ఈ నిర్ణయం వెనుక అమరావతి ఊసే లేకుండా చేసే కుట్ర ఉందనే అనుమానం అంటూ టీడీపీ వ్యాఖ్యలు చేస్తున్నారు.

మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్‌ పట్టణాల సహా వాటి చుట్టుపక్కల ఉన్న 21 గ్రామాలను కలిపి మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌(ఎంటీఎంసీ) ఏర్పాటు చేసారు. మంగళగిరి మండలంలో 14 గ్రామాలు ఉండగా కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లును మినహాయించి మిగతా 11 గ్రామాలు కార్పొరేషన్ పరిధి కిందకు తీసుకొచ్చారు. తాడేపల్లి పట్టణంతో పాటు ఆ మండల పరిధిలోని పది గ్రామాలను కార్పొరేషన్‌ కిందకు తీసుకొచ్చారు.

- Advertisment -

Most Popular

Recent Comments