Tuesday, June 22, 2021
Home State Affairs లేదు లేదు... షర్మిల నియోజకవర్గం అది కాదు: ముఖ్య అనుచరుడు

లేదు లేదు… షర్మిల నియోజకవర్గం అది కాదు: ముఖ్య అనుచరుడు

తెలంగాణాలో వైఎస్ హర్మిల పార్టీ పెడుతున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా షర్మిల… పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, ఆమె ఈ నియోజకవర్గంలో అడుగు పెడతారని కథనాలు వచ్చాయి. దీన్ని ఆమె అనుచరుడు కొండా రాఘవరెడ్డి తప్పుబట్టారు.

పాలేరు నుండి షర్మిల పోటీ చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు. ముందు పార్టీ నిర్మాణం మీదనే మా దృష్ఠి అన్నారు. ఏప్రిల్ 8 వరకు ఖమ్మం సభకే ఇప్పుడు మా ప్రాధాన్యత అని వెల్లడించారు. ఖమ్మం లో నిర్వహించే సభకోసమే కోఆర్డినేటర్ ను పెట్టాం అని, పార్టీ ప్రకటించకుండానే ఎన్నికలలో పోటీ పై ఆలోచన ఎందుకుంటుంది అని నిలదీశారు.

- Advertisment -

Most Popular

Recent Comments