Tuesday, June 22, 2021
Home State Affairs ఏపీ విద్యార్ధులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పినట్టే...?

ఏపీ విద్యార్ధులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పినట్టే…?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదనే చెప్పాలి. ఇక తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేసారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు ఉంటాయని పేర్కొన్నారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని చెప్పారు.

ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం అని వివరించారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి అని సూచించారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం అని అన్నారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisment -

Most Popular

Recent Comments