Thursday, June 24, 2021
Home State Affairs వైసీపీలో చిచ్చుపెట్టిన జేసి బ్రదర్

వైసీపీలో చిచ్చుపెట్టిన జేసి బ్రదర్

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈరోజు మున్సిపల్ చైర్మన్ కావడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెల్ప్ చేశాడు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అనుకుని ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మున్సిపల్ చైర్మన్ గా కూర్చుని పరిస్థితి లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాడిపత్రిని అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రి బొత్స ఇతర నేతలు కూడా కలుస్తా అని ఆయన చెప్పుకొచ్చారు.

ఎంపీ తలారి రంగయ్య ఎమ్మెల్యే పెద్దారెడ్డి కి లేఖలు కూడా రాస్తాను అని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి…ఆయన్ని కలవడం లో తప్పులేదు రాజకీయం వైరం వేరు అని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే తప్పేముంది.. ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి బాస్ అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నే నన్ను పొగిడాడు అని అతను హెల్ప్ చేస్తాడు అని చెప్పుకొచ్చారు. పోలీసులు పంచాయతీ… మున్సిపల్ ఎన్నికల్లో సహకరించారు అన్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments