Thursday, June 24, 2021
Home State Affairs జగన్ ఆదాయంపై జేసి దివాకర్ రెడ్డి లెక్క... ఒక్క రోజు ఆదాయం ఇంత ఉంటుందా...?

జగన్ ఆదాయంపై జేసి దివాకర్ రెడ్డి లెక్క… ఒక్క రోజు ఆదాయం ఇంత ఉంటుందా…?

వైసీపీ నేతల అవినీతిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి కొన్ని సంచలన విమర్శలు చేసారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రోజు ఆదాయం 300 కోట్లు అంటూ ఆయన మీడియాతో అన్నారు. నిజమో అబద్ధమో తెలియదు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు.

డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారు అని విమర్శించారు. కుప్పంను చంద్రబాబు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినా…వైసీపీ తో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారు అని జేసి వ్యాఖ్యానించారు. అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారన్న ఆయన… అభివృద్ధి చూసి వైసిపికి ఓటేశారని చెప్పడం అబద్ధం… అది దొంగ మాట అంటూ కొట్టిపారేశారు. చంద్రబాబు ఎలాంటి వారో… జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో ప్రజలకు తెలుసన్నారాయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments