Thursday, June 24, 2021
Home State Affairs తిరుమల వెళ్ళే వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం

తిరుమల వెళ్ళే వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం

ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులును టీటీడీ అనుమతిస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్ లో టిక్కేట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. వాళ్ళను మాత్రమే ప్రస్తుతానికి ఆర్జిత సేవలకి టీటీడీ అనుమతిస్తుంది. ఏడాది కాలానికి సంబంధించి 28258 సుప్రభాత సేవ టిక్కేట్లు, 6468 తోమాల సేవా టిక్కెట్లు, 6808 అర్చన సేవా టిక్కెట్లు,2124 అష్టదళపాదపద్మారాధన సేవ టిక్కేట్లు,2136 తిరుప్పావడ సేవా టిక్కెట్లు,5464 అభిషేకం సేవా టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేసారు.

వసంతోత్సవం, సహస్రకళషాభిషేకం, విశేష పూజలను ఇక పై ఏడాదికి ఒక్కసారే నిర్వహించాలని పాలకమండలి తీర్మానం చేసింది. ప్రతి నిత్యం ఉత్సవమూర్తులుకు అభిషేకం నిర్వహిస్తూనందున.. విగ్రహాలకు అరుగుదల సంభవిస్తూందని అర్చకులు పేర్కొన్నారు. ఆగమపండితులు,ఆలయ జియ్యంగార్లు సలహ మేరకు ఇక పై ఏడాదికి ఒక్కసారే వసంతోత్సవం, సహస్రకళషాభిషేకం,విశేషసేవ పూజలు చేస్తారు.

- Advertisment -

Most Popular

Recent Comments