Thursday, June 24, 2021
Home State Affairs కర్నూలు వాసుల కల నెరవేరుస్తున్న సిఎం జగన్

కర్నూలు వాసుల కల నెరవేరుస్తున్న సిఎం జగన్

గురువారం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తారని ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కర్నూలు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. ఉదయం11.45 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ చేరుకోనున్న సీఎం… మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.12 గంటలకు మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారు.

12.18 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం, జ్యోతి ప్రజ్వలన, అనంతరం స్ధానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 12.22 గంటలకు కర్నూలు – విశాఖపట్టణం విమాన సర్వీస్‌ ప్రారంభం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌లను ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు సిఎం జగన్.

- Advertisment -

Most Popular

Recent Comments