Thursday, June 24, 2021
Home State Affairs ఏపీలో ఉద్యోగుల మధ్య కొత్త వివాదం, కలెక్టర్లను టార్గెట్ చేసిన రెవెన్యూ

ఏపీలో ఉద్యోగుల మధ్య కొత్త వివాదం, కలెక్టర్లను టార్గెట్ చేసిన రెవెన్యూ

కలెక్టర్లపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏపీలో కలెక్టర్లు వర్సెస్ తహశీల్దార్లుగా పరిపాలన ఉందని అన్నారు. 2019 ఎన్నికల్లో రెవెన్యూ ఉద్యోగులు ఖర్చు పెట్టిన బిల్లులు చెల్లించకుండా కలెక్టర్లు ఇబ్బందిపెడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. రెవెన్యూ ఉద్యోగులపై వత్తిడి ఉన్నా కష్టపడి పని చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.

ఆర్ధిక వత్తిడులను రెవెన్యూ ఉద్యోగులు తట్టుకోలేరు అని తెలిపారు. తహశీల్దార్లకు చెల్లించే వాహన ఖర్చుల్లో కూడా కోత విధిస్తున్నారు అని, రెవెన్యూ సిబ్బందికి చెల్లించాల్సిన డబ్బులతో కలెక్టర్లు బంగ్లాలు మరమ్మత్తులు చేయించుకుంటున్నారు అన్నారు. విద్యుత్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో తహసీల్దార్‌ కార్యాలయాలు పని చేస్తున్నాయి అని మండిపడ్డారు.

- Advertisment -

Most Popular

Recent Comments