Thursday, June 24, 2021
Home Prime Politics సడెన్ గా స్కూల్ కి వెళ్ళిన హరీష్ రావు, కంగారు పడిపోయిన పిల్లలు

సడెన్ గా స్కూల్ కి వెళ్ళిన హరీష్ రావు, కంగారు పడిపోయిన పిల్లలు

మెదక్ జిల్లా పాపన్న పేట మండలం, కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల లో మాస్టర్ గా మారిపోయారు తెలంగాణా ఆర్థిక మంత్రి హరీశ్ రావు. కరోనా అనంతరం పాఠశాల ఎలా నడుస్తుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి… పలు సూచనలు చేసారు. తెలుగు, లెక్కల సబ్జెక్టు లలో విద్యార్థుల ప్రావీణ్యకను ఆయన పరీక్షించారు. డాక్టర్ కావాలంటే‌ఏం చదవాలి….

Telangana minister Harish Rao tests positive for coronavirus

డాక్టర్ అయితే అమెరికా వెళ్తావా…. ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేస్తావా అని విద్యార్థి మనోగతాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలీసు అవుతాన్న విద్యార్థితో… పోలీసయితే ఏం చేస్తావని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై మాట్లాడమని విద్యార్థులను ఆయన కోరడం గమనార్హం. తెలుగు నుడికారాలు , జాతీయాలు, సామెతలు, సోంత వాక్యాలపై ప్రశ్నలు వేసారు. కరోనా వల్ల‌ చదువు కోల్పాయారా అని ఆరా తీసారు. మధ్యాహ్న భోజన వసతి పై ఆరా తీసారు. విద్యార్థుల ను బాగా సానబట్టాలని‌ ఉపాధ్యాయులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments