Thursday, June 24, 2021
Home Prime Politics తెలంగాణా ప్రైవేట్ ఆస్పత్రులకు హైకోర్ట్ షాక్ ఇస్తుందా...?

తెలంగాణా ప్రైవేట్ ఆస్పత్రులకు హైకోర్ట్ షాక్ ఇస్తుందా…?

కోవిడ్ చికిత్స చేయడానికి అనుమతి లేకపోయినా చికిత్స చేస్తున్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వనస్థలిపురం లోని EVYA హాస్పిటల్ కి పెర్మిషన్ లేకపోయినా కోవిడ్ చికిత్స చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా చికిత్స చేస్తున్నందుకు EVYA హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు లో రాజేష్,మధుసూధన్,పద్మావతి రిట్ పిటీషన్ దాఖలు చేసారు.

కరోనా చికిత్స పేరుతో తమ వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇవ్వాళ హైకోర్టులో ఈ రిట్ పై విచారణ జరుగుతుంది. చాలా ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పేరు చెప్పి చాలా మందికి అన్యాయం చేస్తున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా హెచ్చరికలు చేసినా హైకోర్ట్ చివాట్లు పెట్టినా ఆస్పత్రుల్లో మార్పు లేదు.

- Advertisment -

Most Popular

Recent Comments