Thursday, June 24, 2021
Home Prime Politics రుణాలు తీసుకున్న వాళ్లకు సుప్రీం కోర్ట్ షాక్

రుణాలు తీసుకున్న వాళ్లకు సుప్రీం కోర్ట్ షాక్

ఆర్బీఐ తీసుకొచ్చిన రుణ మారటోరియంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం పొడిగించాలని దాఖలైన పలు పిటిషన్లపై ఈ తీర్పు ఇచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించమని కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

మారటోరియం కాలాన్ని పొడిగంచమని కేంద్రానికి చెప్పేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయమని చెప్పలేమని ఇప్పటికే 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది.

- Advertisment -

Most Popular

Recent Comments