Thursday, June 24, 2021
Home Prime Politics టీటీడీ ఆస్తులు అమ్మే ప్రశ్నే లేదు... క్లారిటీ ఇచ్చేసారు

టీటీడీ ఆస్తులు అమ్మే ప్రశ్నే లేదు… క్లారిటీ ఇచ్చేసారు

టీటీడీ ఆస్తుల పై దాఖలైన పిటీషన్‌ను ఏపీ హైకోర్ట్ పరిష్కరించింది. ఆస్తుల పరిరక్షణకు టీటీడీ తీసుకున్న చర్యల పై గతంలో కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు న్యాయవాది యలమంజుల బాలాజీ. టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం గతంలో నియమించిన కమిటీని మార్చి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ మార్చి 9న జీఓ జారీ చేశామని టీటీడీ పేర్కొంది. పదవీ విరమణ చేసిన యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ కె.శ్రీధర్‌ రావు, మాజీ న్యాయమూర్తి ఎం.సీతారామ మూర్తి నేతృత్వంలో 9 మంది సభ్యులతో కమిటీని నియమించామని టీటీడీ చెప్పింది.

బంగారు ఆభరణాలు, నగదు వివరాలను కూడా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని న్యాయవాది బాలాజీ కోరగా ఇలా చేస్తే భద్రతా సమస్యలు ఏర్పడతాయని టీటీడీ పేర్కొంది. బంగారు నగల పై ఇప్పటికే జగన్నాధరావు కమిటీ ఇచ్చిన సిఫారస్‌లను అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. టీటీడీకి దాతలు ఇచ్చిన భూములను భవిష్యత్తులో అమ్మబోమని కూడా హైకోర్టుకు టీటీడీ స్పష్టం చేసింది. దీంతో ఈ పిటీషన్‌ను డిస్పోజ్‌ చేసింది ధర్మాసనం.

- Advertisment -

Most Popular

Recent Comments