Thursday, June 24, 2021
Home Prime Politics విజయవాడ టీడీపీలో రోడ్డెక్కారు... చంద్రబాబుకి డెడ్ లైన్

విజయవాడ టీడీపీలో రోడ్డెక్కారు… చంద్రబాబుకి డెడ్ లైన్

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విజయవాడ తెలుగు తమ్ముళ్ల మద్య విభేదాలు బయటపడ్డాయి. బోండా ఉమా నివాసంలో సమావేశమైన అనంతరం ఎమ్మెల్సీ వెంకన్న, నాగుల మీరా ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కేశినేని వ్యవహరిస్తూన్న తీరుపై అసంతృప్తిగా ఉన్న ముగ్గురు నేతలు… మేయర్ ఎంపిక విషయంలోను చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

చంద్రబాబును కేశినేని రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నగరంలో రూట్ మ్యాప్ పై మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేశినేని నానీ కులాహంకారంతో మాట్లాడుతున్నారని, చంద్రబాబుకి కేశినేని నానీ కావాలో మేము కావాలో తేల్చుకోవాలి అంటూ సవాల్ చేసారు. కేశినేని మాట ఇక్కడ ఎవరూ వినే పరిస్థితి లేదని అన్నారు. పార్టీని నమ్ముకొని,పార్టీ కోసం పనిచేసిన నాయకులం మేము అని స్పష్టం చేసారు. కేశినేని ఏకపక్ష ధోరణితో కార్యకర్తలు,నాయకులు విసిగిపోయారు అని మండిపడ్డారు. టిడిపి పార్టీకి బడుగు,బలహీనవర్గాలు పట్టుకొమ్మలు అన్నారు. అలాంటి వర్గాలను కేశినేని నాని…నరికేస్తున్నాడు అని విమర్శించారు. .

- Advertisment -

Most Popular

Recent Comments