Tuesday, June 22, 2021
Home Prime Politics తాడిపత్రిలో వైసీపీకి దెబ్బ పడినట్టే...?

తాడిపత్రిలో వైసీపీకి దెబ్బ పడినట్టే…?

తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసారు. తాడిపత్రి మున్సిపాలిటీ లో ఎలక్షన్ లో భాగంగా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్న నలుగురు ఎమ్మెల్సీలు దరఖాస్తు చేసుకున్నారు అని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి , శమంతకమణి, మహమ్మద్ ఇక్బాల్ ఉన్నారని అన్నారు.

ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎమ్మెల్సీ సెక్షన్ 5(2)4A ప్రకారం యం. ఎల్.సి ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఎక్కడైతే ఓటు హక్కు నమోదు కాబడి ఉంటుందో అక్కడే ఎక్స్ అఫిషియో ఓటుకు అర్హులు అని తెలిపారు. వైసీపీకి ఇప్పుడు 16 మంది బలం ఉండగా ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్లతో 18 మంది అవుతుంది. టీడీపీకి 18 మంది ఉండగా… స్వతంత్ర, సిపిఐ నుంచి ఇద్దరి మద్దతు ఉంది.

- Advertisment -

Most Popular

Recent Comments