Thursday, June 24, 2021
Home Prime Politics పాపం: మంత్రి బొత్సాకే అన్యాయం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే

పాపం: మంత్రి బొత్సాకే అన్యాయం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే

విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎమ్మెల్యే కోలగట్లకు వ్యతిరేకంగా అసమ్మతి స్వరం పెరుగుతుంది. 35 మంది నగర నేతలతో కలసి రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ చిన్ననాటి స్నేహితులు, అనుచరులు హాజరు అయి తమ ఆవేదనను వ్యక్తం చేసారు.

Urban Development Minister Botcha Satyanarayana declares no Building  Penalisation Scheme for next fi- The New Indian Express

తాము మంత్రి బొత్స సత్యన్నారాయణ అనుచరులమని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తమను అణచివేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. నగరంలో పార్టీని రెండుగా చీల్చింది కోలగట్లే అని వారు పేర్కొన్నారు. పార్టీకి తొలుత నుండి కష్టపడుతున్న తమకు కారొరేటర్లుగా బి.ఫారాలు అందించాలి అని డిమాండ్ చేసారు. సీనియర్లు కాదని.. తన షాపుల్లో పనిచేసిన అనేక మందికి ఎమ్మెల్యే బి.ఫారాలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు అని వారు ఆరోపించారు.

వైసిపి సీనియర్ నేత పిల్లా విజయకుమార్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే, ఎం.పి ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామి క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు, తన సొంత పరపతిని పెంచుకోవటానికి ఎమ్మెల్యే పార్టీకి నష్టం చేస్తున్నారు అని అన్నారు. తనని కలసి టిక్కెట్ ఇవ్వమని కోరినా ఎమ్మెల్యే కోలగట్ల మెండిచేయి చూపించారు అని మాజీ వైస్ ఛైర్మెన్ లెంక వరలక్ష్మి ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments