Thursday, June 24, 2021
Home Prime Politics వాలంటీర్లకు నిమ్మగడ్డ మరో షాక్...!

వాలంటీర్లకు నిమ్మగడ్డ మరో షాక్…!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఇక వార్డు వాలంటీర్ల తో చట్ట విరుద్ధంగా ఎన్నికల పనులు చేయిస్తున్నట్టు ఎస్ఈసీ కి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అతిక్రమించడం క్రిందకు వస్తుందన్న ఎస్ఈసీ… వార్డు వాలంటీర్ల వినియోగంపై కంప్లైంట్ ఇవ్వడానికి కాల్ సెంటర్ కు కాల్ చేయచ్చని పేర్కొంది.

ఎస్ఈసీ మెయిల్ ఐడీ secy.apsec2@gmail.com కు మెయిల్ ద్వారా కూడా పిర్యాదు చేయవచ్చని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమీషనర్లు కంప్లైంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశం ఇచ్చింది. వార్డు వాలంటీర్లు ఓటర్లను సంప్రదించడం, ప్రభావితం చేయడం ఎలక్షన్ చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారని ఎస్ఈసీ స్పష్టం చేసింది. వార్డు వాలంటీర్ల వినియోగం ఎలక్షన్లలో నిషేదం అని పేర్కొంది.

- Advertisment -

Most Popular

Recent Comments