Thursday, June 24, 2021
Home Prime Politics మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు...?

మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు…?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. కాసేపటి క్రితం ఏపీ ఎన్నికల సంఘం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్క విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు, కార్పొరేషన్లలో వివిధ పార్టీలకలు వచ్చిన ఓట్‌ షేర్‌ ఒక్కసారి చూస్తే… వైఎస్‌ఆర్‌ సీపీకి 52.63 శాతంగా ఉంది.

తెలుగుదేశం పార్టీకి 30.73 శాతం, బిజేపీకి 2.41 శాతం, జనసేన పార్టీకి 4.67 శాతం, సీపీఐకి 0.80 శాతం, సీపీఎంకి 0.81 శాతం, కాంగ్రెస్‌ పార్టీకి 0.62 శాతం, బీఎస్పీకి 0.09 శాతం, ఇతర రిజిస్టర్‌ పార్టీలన్నీ కలిపి 0.44 శాతం, స్వతంత్ర అభ్యర్ధులకు 5.73 శాతం, నోటాకు 1.07 శాతం వచ్చాయి.

- Advertisment -

Most Popular

Recent Comments