Tuesday, June 22, 2021
Home Prime Politics ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆమరణ దీక్ష...?

ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆమరణ దీక్ష…?

కూకట్పల్లి లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్, మోడీ వేరు వేరు కాదు..ఒకే నాణేనికి బొమ్మ బొరుసు అని ఆరోపించారు. ఐ టీ ఐ ఆర్ రాలేదని కేటిఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అని అన్నారు. ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం… కేటిఆర్ కు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి అని సవాల్ చేసారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధిద్దాం అన్నారు. మోడీ అంటే కేసీఆర్ కు చలి జ్వరం అన్నారు. 191000 ఉద్యోగాల ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలి అని డిమాండ్ చేసారు. తెలంగాణ కు అన్యాయం చేస్తున్న మోడీ తో ఎందుకు జతకట్టాడో కేసీఆర్ తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలి అని కోరారు.

- Advertisment -

Most Popular

Recent Comments