Thursday, June 24, 2021
Home Prime Politics పాపం తెలంగాణా మందు బాబులు

పాపం తెలంగాణా మందు బాబులు

తెలంగాణలో నేటి నుంచి మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఎల్లుండు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో వైన్ షాపులతో పాటుగా బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులను మూసివేస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు ప్రచారం చివరి రోజు. ఈ నేపధ్యంలో నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటలకు వైన్ షాప్‌లు మూసివేస్తారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 14న తేదీన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటుగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి ఎన్నికలు ఉన్నాయి. వచ్చే నెల 17 న ఫలితాలు రానున్నాయి. ఆ రోజు కూడా మూసివేస్తారు.

- Advertisment -

Most Popular

Recent Comments