Thursday, June 24, 2021
Home National Issues అతడి పాడె మోయడం వెనుక ఇంత కథ ఉందా?

అతడి పాడె మోయడం వెనుక ఇంత కథ ఉందా?

కాంగ్రెస్ అగ్ర నేత సతీష్ శర్మ మరణంతో కాంగ్రెస్ పార్టీ విషాదంలో మునిగిపోయింది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఆయనకు పేరుంది. అయితే ఆయన పాడే రాహుల్ గాంధీ మోయడమే సంచలనం అయింది. అసలు రాహుల్ గాంధీకి ఆయన అంటే ఎందుకు అంత ఇష్టమో ఒక్కసారి చూద్దాం.

పైలెట్ అయిన కెప్టెన్ సతీష్ శర్మ ముందు నుంచి కూడా గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. రాజీవ్ గాంధీకి, సోనియా గాంధీకి, ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆయన అత్యంత సన్నిహిత వ్యక్తిగా చెప్తారు. గోవాలో 73 ఏళ్ళ వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. దీనిపై రాహుల్ గాంధీ ట్వీట్ చేసారు. “కెప్టెన్ సతీష్ శర్మ మరణం గురించి విని నేను చాలా బాధపడ్డాను. అతని కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు సంతాపం తెలియజేసారు.” సతీష్ శర్మ 1993 నుండి 1996 వరకు నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిగా ఉన్నారు. మూడుసార్లు లోక్‌సభ ఎంపిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కంచుకోటలుగా చెప్పే రాయ్ బరేలి, అమేథి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలు అందించారు. అతను మొదట జూన్ 1986 లో రాజ్యసభ సభ్యుడు కాగా… రాజీవ్ గాంధీ మరణం తరువాత 1991 లో అమేథి నుండి లోక్సభకు ఎన్నికయ్యాడు.

రాజీవ్ మరణం తర్వాత ప్రియాంకా, రాహుల్ గాంధీలకు ఆయన గురువు అయ్యారు. సోనియా గాంధీని ప్రోత్సహించారు. రాహుల్ గాంధీకి వ్యక్తిగత అంశాల్లో కూడా ఆయన ప్రోత్సాహం అందించారు. అందుకే రాహుల్ గాంధీ పాడే మోసారని, రాజీవ్ మరణం తర్వాత గాంధీ కుటుంబం కోసం ఆయన ఎక్కువగా టెన్ జన్ పథ లోనే ఉన్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments