Thursday, June 24, 2021
Home National Issues కేంద్రానికి బ్యాంకులు స్ట్రాంగ్ వార్నింగ్

కేంద్రానికి బ్యాంకులు స్ట్రాంగ్ వార్నింగ్

విజయవాడ ఐదోనెంబర్ రోడ్డులోని ఎస్ బీఎస్ జోనల్ బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున బ్యాంకు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసారు. రెండు రోజుల పాటు సమ్మె బాట పట్టి బ్యాంకు ఉద్యోగులు… కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బ్యాంకు యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటికరణ చేస్తున్నాని ప్రకటించాడన్ని వెంటనే వెనక్కి తీసుకొవాలి అని డిమాండ్ చేసారు.

మా జీతాల కోసం, మా సమస్యల పరిష్కారం కోసం అందోళన చేయడంలేదు అని ఆయన అన్నారు. ఇది బ్యాంకు ఉద్యోగస్తులు సమస్య కాదు… ప్రజలందరి సమస్య అందుకే పోరాటం చేస్తున్నాం అని స్పష్టం చేసారు. వేల కోట్లు రూపాయలు రాజకీయ నాయకులే… బ్యాంకు వద్ద అప్పులు తీసుకుని చెల్లించడంలేదు అని, కేంద్ర ప్రభుత్వం అలాంటి వాటి పైన చర్యలు తీసుకుంటే… అన్ని బ్యాంకులు లాభాల బాటే పడతాయి అని స్పష్టం చేసారు. కేంద్ర ప్రభుత్వం స్పందించక పోతే… సమ్మెను తీవ్రతరం చేస్తాం అన్నారు. నిరవధిక సమ్మె కూడా చేస్తామని అన్నారు. ప్రజలు మా వెనుక ఉండి మమ్ములను నడిపించాలి అని కోరారు. మా సమ్మెకు ప్రజలు పూర్తి మద్దతు కావాలి అని కోరారు.

- Advertisment -

Most Popular

Recent Comments