Thursday, June 24, 2021
Home అమెరికాలో మంచు విలయం

అమెరికాలో మంచు విలయం

తాగే నీళ్లు కూడా గడ్డ కట్టుకుపోతున్నాయ్ , నో కరెంట్ , బెడ్ రూంతో సహా ఎక్కడ చూసినా మంచు , అగ్రరాజ్యంలో అరవైరెండు మంది బలి.

తలాపున సముద్రం ఉన్నా .. తాగడానికి గుక్కెడు నీళ్లు కరవన్నట్టుంది అమెరికా పరిస్థితి . ఇంటి బెడ్ రూం ఫ్యాన్ సహా అన్నీ మంచు గడ్డల్లా మారిపోతున్నాయ్ . ఎటు చూసినా .. మంచు మంచు . అయితే , తాగడానికి గ్లాస్ నీళ్లు లేవు , తాగే నీరుకూడా మంచు గడ్డలా మారిపోయింది . పవర్ గ్రిడ్లు ఫెయిలై రోజుల తరబడి కరెంటు కూడా లేకపోవడంతో అగ్రరాజ్యం , ముఖ్యంగా టెక్సాస్ ప్రాంతం తల్లడిల్లిపోతోంది . మంచుధాటికి అగ్రరాజ్యంలో ఇప్పటివరకూ 62 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితికి అడ్డంపడుతోంది .

టోటల్ గా అమెరికాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది . ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో .. నీరు ఎక్కడికక్కడ గడ్డ కట్టుకుపోయింది . కొన్ని రోజులుగా ఏడ తెరపి లేకుండా కురుస్తున్న మంచు ప్రభావానికి అప్రకటిత లాక్ డౌన్ ఏర్పడింది . మంచు ధాటికి తట్టుకోలేక 60 మంది మృతి చెందారు . పరిస్థితి రోజు రోజుకు చేయి దాటిపోతోంది . రోజు వారి పనులకు అవసరమైన నీరు దొరకక , తాగడానికి గుక్కెడు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు . మంచు తుఫాను ప్రభావం టెక్సస్ , హ్యుస్టన్లలో మరింత తీవ్రతరమైందని అంచనా వేస్తున్నారు అధికారులు . అక్కడ మంచి నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది . తుఫాను కారణంగా మంచి నీటి పైపులలో ఉండే నీరు గడ్డ కట్టుకుని పోవడంతో నీటి సమస్య ఏర్పడింది . నిత్యావసరాలకు కాకపోయినా కనీసం తాగడానికి మంచి నీళ్ళు కావాలంటూ వేలాది మంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు .

హాస్పిటల్స్ లో రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది . ప్రభుత్వం మంచును కరిగించి ఆ నీటిని బాటిల్స్ లో నింపి రోగులకు అందిస్తోంది . మంచు తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కొన్ని నగరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు . మంచుని కరిగించుకుని కాచి వడబోసి తాగడం తప్ప .. స్థానిక ప్రభుత్వాలు ఎలాంటి పరిష్కారం చూపలేక పోతున్నాయి . ఇదంతా నాణానికి ఒకవైపు అయితే .. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో జనం అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు . మంచు గడ్డల మధ్య డాన్స్ చేస్తూ .. సరదా తీర్చుకుంటున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments