Tuesday, June 22, 2021
Home Movie Mania నీది నాది ఒకే దారి. ఇప్పుడు సురేఖ వంతు!?

నీది నాది ఒకే దారి. ఇప్పుడు సురేఖ వంతు!?

చూసే వాళ్లకు సినీ నటుల జీవితాలు చాలా సంతోషంగా కనపడతాయి. వాళ్ళకుండే అందంలానే వాళ్ళ జీవితం కూడా డబ్బుతో అందంగా ఉంటుంది అనుకుంటారు. వ్యక్తిగతంగా వాళ్ళు పడే బాధలు చాలా మందికి అవగాహన లేదు. ఈ బాధలు కనపడకుండా వారి నటనతో మనల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలను వదిలేసిన హీరోలు, భర్తల కారణంగా ఇబ్బంది పడే నటులు ఎందరో ఉన్నారు.

ఇటీవల సింగర్ సునీత ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఎంతో మంచి పేరు, అందానికి అందం… ఇద్దరు పిల్లలు… అయినా సరే తోడు లేక వివాహం చేసుకున్నారు. ఇక ప్రముఖ నటి సురేఖా వాణి కూడా ఒంటరిగానే ఉంటున్నారు. 2019 లో తన భర్త సురేష్ తేజ మరణం తర్వాత ఒంటరిగా ఉంటున్న ఆమె… సినిమాల్లో లేకపోయినా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు.

కూతురు సుప్రీతతో కలిసి ఉంటున్న ఆమె… త్వరలోనే వివాహం చేసుకునే అవకాశం ఉంది. భర్త మరణం, అవకాశాలు లేకపోవడంతో… ఆమె కుమార్తె సుప్రీత ప్రోత్సాహంతో రెండో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారట. దీనిపై ఎలాంటి ప్రకటన లేదు గాని సోషల్ మీడియాలో మాత్రం గాసిప్స్ చక్కర్లు కొట్టేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments