Thursday, June 24, 2021
Home కరోనా..మత్ డరోన!

కరోనా..మత్ డరోన!

వచ్చే సోమవారం నుండి టీకా అందరకీ అందుబాటులో రానుంది . ఈ లోగా కేసులు పెంచి చూపిస్తున్నారు . సారీ.. టైపింగ్ మిస్కట్. కేసులు పెరుగుతున్నాయి . రెండో వేవ్ వచ్చేసింది అంటూ ప్రచారం ఇంకా ఉదృతం కానుంది . మహారాష్ట్రలో అయితే దాదాపు తొమ్మిది వేల కేసులు రిపోర్ట్ అయ్యాయి . తెలంగాణ లో వరల్డ్ డో మీటర్ WEBSITEప్రకారం సున్నా టెస్ట్ లు చేస్తే 345 కేసులు బయట పడ్డాయి . ఆంధ్రప్రదేశ్ లో కేసులు రెట్టింపు అయ్యాయని రాతలు . అదేంటో ఆ కేసులు కూడా టీకా రావడం చూసి పెరుగుతున్నాయి . అయినా భయపడే వారు టీకా వేసుకోవచ్చు కదండీ ?

ఇక .. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు . కేసులు .. కేసులు అంటూ మెంటల్ కేసులా మరానక్కర లేదు . హ్యాపీగా ప్రైవేట్ కేంద్రానికి పోండి .. టీకా వేయించుకోండి . ప్రస్తుతానికి 45 పై బడిన వారికి అంటున్నారు . 45 పై బడిన వారికి ఇతరత్రా వ్యాధులు ఉంటేనే అంటున్నారా ? ఆబ్బె .. మీరు మరీను .. అక్కడికి పోండి. అప్పటికప్పుడు మీకు బీపీ చెక్ చేస్తారు . అది ఎక్కువ ఉంటుంది . అంటే పని అయిపోయిన్నట్టే . అన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితం . ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తే ప్రైవేట్ కు డబ్బు కట్టి ఎవరు పోతారు అంటారా ? అది కూడా చూద్దురు కానీ .

                          అన్నట్టు ఒక మాట ! ఈ సారికి టీకా ఉచితం . సంవత్సరానికి ఎన్ని సార్లు .. ఇలా జీవితాంతం .. సంవత్సరానికి రెండు సార్లు ఇక టీకా వేయించుకోవలసిందేనా ? అప్పుడు కూడా  ఫ్రీగా ఇస్తారా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు .

                            టీకా వేసుకొంటే ఇక కరోనా రాదా ?  అయ్యా.. టీకా వేసుకున్నా మాస్క్ పెట్టుకోవాలి .. చేతికి సారా పోసుకోవాలి అంటున్నారుగా ? టీకా వేసుకున్నా కరోనా వస్తే అప్పుడు తప్పు మీదే కదా ? ఒక వేళ అందరూ టీకాలు  వేసుకున్నాక మళ్ళీ ఆరు నెలలకు  కేసులు చూపించారనుకోండి ..అదే వచ్చాయనుకోండి . .. అప్పుడు 3 rd .. వేవ్  అప్పుడు మళ్ళీ ఇంకా పవర్ఫుల్ టీకా ఇంకా ఎక్కువ ధరకు వస్తుంది . హ్యాపీ గా అప్పుడు కొత్త టీకా వేసుకోండి . ఇక భయపడకండి . మూడు వేవ్ లు .. ఆరు టీకాలు 

కరోనా అంటూ మత్ డరోనా. భయపడే హక్కు ఇక లేదు . ఎందుకంటే మీ భయానికి విరుగుడు వచ్చేసింది .అందరూ టీకాలు వేసుకోండి . టీకా వల్ల మహా అంటే కొంత మందిలో చిన్న చిన్న ఎలర్జీ లు రావొచ్చు . అది పెద్ద సమస్య కాదు .-

— అమర్ నాథ్ వాసిరెడ్డి, ప్రముఖ విద్యావేత్త

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments