Thursday, June 24, 2021
Home Crime Corner తల్లిపై ఉన్న ప్రేమ భార్య చావుకొచ్చింది

తల్లిపై ఉన్న ప్రేమ భార్య చావుకొచ్చింది

ఈ రోజుల్లో తల్లిని చాలా మంది జాగ్రత్తగా చూసుకోవడం లేదు. పెళ్లి అయిన తర్వాత చాలా మంది తమ తల్లిని అనేక విధాలుగా వేధిస్తున్నారు. పట్టించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. కాని తెలంగాణాలో ఒక వ్యక్తి తల్లిని బాగా చూసుకోవడం లేదని భార్యను చంపేసాడు. రాజేంద్రనగర్ హైదర్ గూడాలో ఈ ‌దారుణం జరిగింది. భార్య గొంతు నులిమి భర్త చంపేసాడు.

స్థానికుల‌ సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు… మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన తల్లిని సరిగ్గా చూసుకోవడం లేదనే కారణంతో భార్య సమంతను భర్త రవి హత్య చేసాడు. అర్ధరాత్రి ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. తాగిన మైకంలో భార్య సమంత పై దాడి చేసాడు. క్షణికావేశం లో భార్య గొంతు నులిమి భర్త రవి చంపేసాడు. వీరి స్వస్థలం అసీఫాబాద్ జిల్లా మంచిర్యాల గ్రామంగా పోలీసులు వెల్లడించారు.

- Advertisment -

Most Popular

Recent Comments