Thursday, June 24, 2021
Home Crime Corner హైదరాబాద్ లో పట్టపగలు దారుణం

హైదరాబాద్ లో పట్టపగలు దారుణం

పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఒక దారుణం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని చబబ్రెస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్ బిఎస్ మక్తాలో నివసిస్తున్న 23 ఏళ్ల యువతిపై మిట్టమధ్యాహ్నం లైంగిక దాడి జరిగింది. మేము హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నుంచి వచ్చామని అంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒకరు గేటు వద్ద నిలబడి ఇంకొకరు పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటూ లోపలకు వెళ్ళారని పోలీసులు వివరించారు.

మాకే పాలసీ అవసరం లేదని ఆ యువతి చెప్పిన వినకుండా ఇంట్లోకి చొరబడి యువతిని వివస్త్రను చేసి యువకుడు ఈ దారుణం చేసాడు. ఈ దారుణం ఈ నెల 8 న జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇంట్లో ఎవరు పెద్దలు లేకపోవడంతో తొమ్మిదో తారీఖు నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది.

- Advertisment -

Most Popular

Recent Comments